న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైతో మ్యాచ్: లుంగి ఎంగిడి రాకతో చెన్నైకు మరింత బలం

By Nageshwara Rao
IPL 2018: Lungi Ngidi joins CSK camp ahead of MI game

హైదరాబాద్: చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. తండ్రి జీరోమ్‌ ఎంగిడి మరణవార్త తెలియడంతో దక్షిణాఫ్రికాకు చెందిన లుంగీ ఎంగిడి అకస్మాత్తుగా ఐపీఎల్ 11వ సీజన్ నుంచి స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే తిరిగి ఐపీఎల్‌లో ఆడేందుకు వస్తాడో లేదోనని అభిమానులు ఆందోళన చెందారు.

తాజాగా అందిన సమాచారం మేరకు లుంగీ ఎంగిడి తిరిగి భారత్‌ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడని తెలిసింది.ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పూణెలో జరగనున్న ఈ మ్యాచ్‌లో లుంగీ ఎంగిడి ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఎంగిడి రాకతో చెన్నై జట్టుకు మరింత బలం

ఎంగిడి రాకతో చెన్నై జట్టుకు మరింత బలం

లుంగీ ఎంగిడి జట్టులో చేరడంతో చెన్నై జట్టుకు మరింత బలం చేకూరినట్లైంది. ఇప్పటికే ఫూణె స్టేడియంలో లుంగీ ఎంగిడి ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏప్రిల్‌ 13న లుంగి తండ్రి జీరోమ్‌ ఎంగిడి మరణించాడు. దీంతో టోర్నీ ఆరంభమైన కొద్ది రోజులుకే లుంగీ ఎంగిడి స్వదేశానికి పయనమయ్యాడు.

ఐపీఎల్ మొత్తానికి దూరమవుతాడనే వార్తలు

ఐపీఎల్ మొత్తానికి దూరమవుతాడనే వార్తలు

దీంతో అతడు మొత్తం ఐపీఎల్‌ సీజన్‌కే దూరమవుతాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది ఆరంభంలో భారత్-దక్షిణాఫ్రికా పర్యటనలో లుంగీ ఎంగిడి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలనుకున్న కోహ్లీసేన ఆశలపై నీళ్లు చల్లాడు. అంతేకాదు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా గెలుచుకోవడంలో కూడా ఎంగిడి కీలకపాత్ర పోషించాడు.

 వేలంలో రూ. 50 లక్షలకు దక్కించుకున్న చెన్నై

వేలంలో రూ. 50 లక్షలకు దక్కించుకున్న చెన్నై

ఈ ప్రదర్శనను చూసే ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో రూ. 50 లక్షలకు చెన్నై ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఆరంభ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం

ఆరంభ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం

ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఐపీఎల్ 11వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడగా చెన్నై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగే మ్యాచ్‌లో ముంబై గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Story first published: Saturday, April 28, 2018, 15:05 [IST]
Other articles published on Apr 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X