న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: KXIP vs SRH: మరో విజయంపై కన్నేసిన హైదరాబాద్

By Nageshwara Rao
IPL 2018: KXIP vs SRH Preview: Playing XIs, Timings, Live Streaming & More

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మొహాలీ వేదికగా జరగనుంది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో విజయంపై కన్నేసింది.

కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలోని పంజాబ్ కూడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు నమోదు చేసింది.

ఆసక్తికరంగా పంజాబ్-హైదరాబాద్ మ్యాచ్

ఆసక్తికరంగా పంజాబ్-హైదరాబాద్ మ్యాచ్

పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్, మూడో స్థానంలో ఉన్న పంజాబ్‌తో తలపడనుండటంతో ఈ మ్యాచ్ ఆసక్తకరంగా మారింది. శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, వృద్ధిమాన్ సాహా, యూసుఫ్ పఠాన్, దీపక్ హుడాతో సన్‌రైజర్స్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది.

గత మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన

గత మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన

సన్‌రైజర్స్ టాపార్డర్‌లో వృద్ధిమాన్ సాహా తప్ప మిగతా వారంతా గత మూడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేశారు. యూసఫ్ పఠాన్, దీపక్ హుడా వంటి హిట్టర్లు ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టించగలరు. ఇక, సన్‌రైజర్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లే కీలకపాత్ర పోషించారు.

ఐదుగురు బౌలర్లతో పటిష్టంగా కనిపిస్తోన్న సన్‌రైజర్స్

ఐదుగురు బౌలర్లతో పటిష్టంగా కనిపిస్తోన్న సన్‌రైజర్స్

ఐదుగురు బౌలర్లతో లైనప్ సన్‌రైజర్స్ పటిష్టంగా కనిపిస్తోంది. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, స్టాన్ లేక్, రషీద్ ఖాన్, షకిబ్ ఇప్పటికే సత్తా చాటారు. రషీద్ ఖాన్ గత మ్యాచ్‌లో 17 డాట్ బాల్స్ వేసి రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను ఎంత వరకు అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

పంజాబ్ తరుపున కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్

పంజాబ్ తరుపున కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్

ఇక, పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ చెలరేగి ఆడుతుండగా... అతనికి గేల్ కూడా తోడయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన క్రిస్ గేల్ సృష్టించిన పరుగుల సునామీని మనమంతా చూశాం. ఆ తర్వాత మయాంక్, కరుణ్, యువరాజ్‌తో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.

సత్తా చాటుతోన్న యువ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్

సత్తా చాటుతోన్న యువ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్

పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే గురువారం జరిగే మ్యాచ్‌లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అతనితో పాటు కెప్టెన్ అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్ హైదరాబాదీ బ్యాట్స్‌మెన్‌పై ఎంత వరకు ప్రభావం చూపెడుతుందన్న అంశంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, రషీద్ ఖాన్ అర్మాన్, శిఖర్ ధావన్, వృద్దిమాన్ సాహ, సందీప్ శర్మ, షకీబ్ అల్ హసన్, కార్లోస్ బ్రాత్‌వైట్, యూసుఫ్ పఠాన్, మొహమ్మద్ నబీ, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్ , బిల్లీ స్టాన్లేక్, సిద్దార్థ్ కౌల్, దీపక్ హుడా, సయ్యద్ ఖలీల్ అహ్మద్, శ్రీవాట్స్ గోస్వామి, బాసిల్ తాంపి, టి నటరాజన్, బిపుల్ శర్మ, మెహదీ హసన్, రికీ భుయ్, సచిన్ బేబీ, తన్మయ్ అగర్వాల్.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

కెఎన్ రాహుల్, మాయాంక్ అగర్వాల్, ఆరోన్ ఫించ్, యువరాజ్ సింగ్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లెర్, మార్కస్ స్టోనియస్, అక్షర పటేల్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), ఆండ్రూ టై, మోహిత్ శర్మ, ముజీబ్ ఉర్ రెహమాన్, క్రిస్ గేల్.

మ్యాచ్ ప్రారంభం: 8:00pm IST (Thursday, April 19)

Live on Star Sports Network

Streamed Live on Hotstar

Story first published: Thursday, April 19, 2018, 11:53 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X