14 బంతుల్లో హాఫ్ సెంచరీ, ఐపీఎల్‌లోనే రాహుల్ కొత్త రికార్డు

Posted By:
IPL 2018: KL Rahul slams fastest-ever IPL fifty

హైదరాబాద్: ఐపీఎల్‌-11వ సీజన్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఆరంభం అదిరిపోయింది. నూతనంగా కెప్టెన్‌ బాధ్యతలు అందుకున్న అశ్విన్ జట్టుకు విజయాన్ని తీసుకొచ్చాడు.
కొత్త కెప్టెన్‌ అశ్విన్‌ సారథ్యంలోని ఆ జట్టుకు తొలి విజయం. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడిన వేళ పంజాబ్‌.. ఢిల్లీని ఓడించి ఘనంగా బోణీ కొట్టింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

మొదట ఢిల్లీ 166/7 స్కోరు చేయగా.. పంజాబ్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్‌ ఓపెనర్ రాహుల్‌ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్‌ బౌండరీల మోత మోగించాడు.

అంతేకాదు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లోనే ఫాస్టెస్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నమోదైంది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో బాది 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

అర్ధ సెంచరీ చేసి ఊపు మీదున్న రాహుల్‌ను బౌల్ట్‌ ఔట్‌ చేశాడు. ఇంతకుముందు ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్లలో యూసఫ్‌ పఠాన్‌, సునీల్‌ నరైన్‌ పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు ఉంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 10:23 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి