న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడిస్తాం: కోల్‌కతా హెడ్ కోచ్

By Nageshwara Rao
IPL 2018: KKR Ready for Must-win SRH Tie, Says Coach Jacques Kallis

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో జరిగే మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని, తద్వారా కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని ఆ జట్టు హెడ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వస్ కల్లిస్ వెల్లడించాడు.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్-కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌‌కి ముందు కల్లిస్ మాట్లాడుతూ 'ఇది మేము తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో రాణిస్తారు. ప్లేఆఫ్‌కు దూసుకెళ్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు' అని అన్నాడు.

'సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కూడా చాలా మంచి క్రికెట్‌ ఆడుతోంది. అందుకే ఆ జట్టు ఎప్పుడో ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుని టాప్‌లో నిలిచింది. వారు మాతో జరిగే మ్యాచ్‌లో ఓడిపోవాలని అనుకోరు. కానీ, మేము చాలా మంచి క్రికెట్‌ ఆడి హైదరాబాద్ జట్టుని ఓడిస్తాం' అని కల్లిస్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ సీజన్ మలి దశకు వచ్చినప్పటికీ ప్లేఆఫ్ బెర్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠరేపుతూ జట్లు అనూహ్య విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్(18), చెన్నై సూపర్ కింగ్స్(16) ప్లేఆఫ్ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌ జట్టుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోవాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వేళ మ్యాచ్ ఓడిపోతే మిగతా జట్ల గెలుపు, ఓటములపై కోల్‌కతా భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

Story first published: Saturday, May 19, 2018, 16:13 [IST]
Other articles published on May 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X