ఐపీఎల్ 2018: మిచెల్ స్టార్క్ స్థానంలో టామ్‌ కర్రన్‌

Posted By:
IPL 2018: KKR announce Tom Curran as replacement for Mitchell Starc

హైదరాబాద్: గాయం కారణంగా ఐపీఎల్ 11వ సీజన్‌కు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ స్థానాన్ని ఇంగ్లాండ్ పేస్ బౌలర్ టామ్ కర్రన్‌తో భర్తీ చేసినట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం వెల్లడించింది. దీంతో టామ్ కర్రన్‌ తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడనున్నాడు.

23 ఏళ్ల టామ్ కర్రన్ జూన్ 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తరుపున మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. తన టీ20 కెరీర్‌లో టామ్ కర్రన్ ఇప్పటి వరకు 7 వికెట్లు తీయగా, వన్డేల్లో 50 వికెట్లు తీశాడు.

గాయం కారణంగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌ స్టార్క్‌ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో టెస్టు ముందు మిచెల్‌ స్టార్క్‌ కుడికాలికి గాయమైంది. దీంతో నాలుగో టెస్టుకు అతడి స్థానంలో 31 ఏళ్ల చాధ్‌ సేయర్స్‌ అరంగేట్రం చేశాడు. దీంతో మిచెల్ స్టార్క్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు.

భవిష్యత్తు టెస్టు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు సైతం దూరం కానున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 9.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

స్టార్క్‌కు గాయం: ఐపీఎల్‌కు ముందు కోల్‌కతాకు భారీ షాక్

ఇప్పటివరకూ మిచెల్ స్టార్క్‌తో కలిపి ఐదుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీకి దూరమయ్యారు. నాథన్‌ కౌట్లర్‌, జాసన్‌ బెహ్రెన్‌డ్రాఫ్‌ గాయాల కారణంగా ఐపీఎల్ 11వ సీజన్‌కు దూరం కాగా, బాల్ టాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 13:18 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి