ఐపీఎల్ 2018: అరుదైన ఘనత సాధించిన నితీశ్ రాణా

Posted By:
IPL 2018: I had nothing to lose, luckily got 2 wickets, says Nitish Rana

హైదరాబాద్: ఐపీఎల్‌-11 సీజన్‌లో కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌ క్రికెటర్ నితీష్‌ రాణా అరుదైన ఘనత సాధించాడు. వరుస బంతుల్లో ఏకంగా దూకుడు మీద ఉన్న బెంగళూరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలను పెవిలియన్‌కు చేర్చి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. బ్యాట్స్‌మన్‌ అయిన నితీష్‌ రాణా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా బంతిని అందుకొని రాణించాడు.

ఇలా వరుస బంతుల్లో ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు దక్కించుకున్న మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఇలా 2012 సీజన్‌లో జాక్వస్‌ కల్లీస్‌ బౌలింగ్‌లో తొలిసారి అవుటవ్వగా.. తిసారా పెరీరా బౌలింగ్‌లో 2016లోనూ ఇలానే పెవిలియన్‌కు చేరారు. తాజాగా నితీష్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో వెనుదిరిగారు.

 కోహ్లిలు దూకుడు మీద:

కోహ్లిలు దూకుడు మీద:

ఇక రాణా బంతి అందుకున్న సమయంలో డివిలియర్స్‌, కోహ్లిలు దూకుడు మీద ఉన్నారు. ఈ సమయంలో రాణాకు బౌలింగ్‌ ఇవ్వడమేంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరనుకున్నట్టే వేసిన తొలి బంతిని డివిలియర్స్‌ సిక్సు బాదాడు. ఆ మరుసటి బంతికే క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం స్ట్రైకింగ్‌ తీసుకున్న కోహ్లి అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

బెంగళూరు ఒక్కసారి కుదేలైంది:

బెంగళూరు ఒక్కసారి కుదేలైంది:

దీంతో భారీ స్కోరు దిశగా పయనించిన బెంగళూరు ఒక్కసారి కుదేలైంది. చివర్లో మన్‌దీప్‌ సింగ్‌ రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇక ఈ కీలక వికెట్ల చేజిక్కించుకోవడంపై మ్యాచ్‌ అనంతరం రాణా సంతోషం వ్యక్తం చేశాడు.

గ్రిప్‌ బాగుండటంతో సరైన ప్రదేశంలో బంతిని:

గ్రిప్‌ బాగుండటంతో సరైన ప్రదేశంలో బంతిని:

‘బాల్‌ గ్రిప్‌ బాగుండటంతో సరైన ప్రదేశంలో బంతిని వేస్తే వికెట్లు పడగొట్టచ్చని భావించా. అదృష్టవశాత్తు రెండు కీలక వికెట్లు దక్కాయి. ఆ సమయంలో ఇవి చాలా కీలకమైన వికెట్లు. దేశవాళి క్రికెట్‌లో ఢిల్లీ తరఫున బౌలింగ్‌ చేసే వాడిని. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశా. దీంతో దినేశ్‌ బాయ్‌ మ్యాచ్‌కు ముందు ఏమ్యాచ్‌లోనైనా ఒకటి, రెండు ఓవర్లు వేసేందుకు సిద్దంగా ఉండని చెప్పాడు. లక్కీగా తొలి మ్యాచ్‌లోనే ఆ అవకాశం రావడంతో నేనెంటో రుజువైందని' ఆనందం వ్యక్తం చేశాడు.

నితీశ్‌ రాణా 25 బంతుల్లో (34)తో రాణించాడు:

నితీశ్‌ రాణా 25 బంతుల్లో (34)తో రాణించాడు:

ఇక బ్యాటింగ్‌లోనూ నితీశ్‌ రాణా 25 బంతుల్లో (34)తో రాణించాడు. దీనిపై స్పందిస్తూ.. ‘పరుగులు చేయడమే నా బాధ్యత. ఒత్తిడి గురించి నేను ఆలోచించలేదు. గత సీజన్‌లో రాణించడంతో నాపై అంచనాలు పెట్టుకోవడం బాగుంది. ఒత్తిడిలోనూ బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తానని' పేర్కొన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 15:50 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి