న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన రికార్డు: ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ తర్వాత పాండ్యానే

By Nageshwara Rao
IPL 2018: Hardik Pandya only the 2nd player in league history after Yuvraj Singh to create this unique record

హైదరాబాద్: ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యా‌చ్‌లో ఆ జట్టు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మాత్రం అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు దక్కించుకోవడంతో పాటు హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు అదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ఘనత సాధించాడు. దీంతో ఈ యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.

18వ ఓవర్‌లో 3 వికెట్లు తీసిన పాండ్యా

18వ ఓవర్‌లో 3 వికెట్లు తీసిన పాండ్యా

మంగళవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా 18వ ఓవర్‌ వేశాడు. ఈ ఓవర్లో తొలి రెండు బంతులకు మన్‌దీప్‌ సింగ్‌(14), విరాట్‌ కోహ్లీ(32)ని పెవిలియన్‌కు చేర్చిన పాండ్యా... అదే ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్‌(1)ను ఔట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

42 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీ

42 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీ

అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒక్కడే 42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో హాఫ్ సెంచరీతో ఫరవాలేదనిపించాడు. దీంతో ఒక మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ తర్వాత రెండో స్ధానాన్ని పాండ్యా దక్కించుకున్నాడు.

యువరాజ్ మూడు సార్లు, పాండ్యా ఒకసారి

యువరాజ్ మూడు సార్లు, పాండ్యా ఒకసారి

ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో మూడు వికెట్లు, హాఫ్ సెంచరీకి పైగా పరుగులు ఇలా... యువరాజ్ సింగ్ మూడు సార్లు నమోదు చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే యువరాజ్, హార్ధిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేసిన ఈ రెండు మ్యాచ్‌ల్లో వారు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఓడిపోయింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో ముంబై 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

* Yuvraj Singh: 50 & 3/22 against RCB in 2009

* Yuvraj Singh: 66*& 4/29 against DD in 2011

* Yuvraj Singh: 83 & 4/35 against RR in 2014

* Hardik Pandya: 50 & 3/28 against RCB in 2018

ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ముంబై

ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ముంబై

ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఈ సారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కూడా కష్టంగా మారింది. టోర్నీలో ఇంకా ముంబై ఇండియన్స్ కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ముంబై ఇండియన్స్‌కు లేదు.

Story first published: Wednesday, May 2, 2018, 14:15 [IST]
Other articles published on May 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X