న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను క్షమించు, ధైర్యంగా నిలబడు: హార్దిక్ పాండ్యా

 IPL 2018: Hardik Pandya Apologises To Injured Teammate Ishan Kishan

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా విసిరిన బంతి నేరుగా వికెట్ కీపర్ ను బలంగా తాకింది. బెంగళూరు లక్ష్య ఛేదనలో వికెట్ కీపర్ ఇషాన్ హెల్మెట్ పెట్టుకోకుండా కీపింగ్ చేస్తుండగా హార్దిక్ పాండ్య త్రో విసిరిన బంతి నేరుగా అతని కంటి పక్కన తాకింది. బలమైన దెబ్బకు అతడు మైదానాన్ని కూడా వీడాడు. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

తన కారణంగా అతడు గాయపడ్డాడని పాండ్యా చాలా బాధపడ్డాడు. మ్యాచ్ ముగిసిన తరువాతి రోజు ఇషాన్‌ను కలిసిన పాండ్య...అతడితో ఫొటో దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. నా ప్రియమైన సోదరుడా.. మన్నించు, బలంగా నిలబడు అని వ్యాఖ్యానించాడు. 2018 ఐపీఎల్ వేలంలో రూ.6.2కోట్లకు ముంబై దక్కించుకుంది.

ఐపీఎల్ 2018 సీజన్‌లోనే అత్యంత రసవత్తరమైన మ్యాచ్‌కి మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక అయింది. రోహిత్ జట్టు కోహ్లీ సేనపై భారీ ఆధిక్యంతో గెలుపొంది. లీగ్ మొత్తానికి ఆలస్యంగా విజయాన్ని చేజిక్కించుకున్న ముంబై జట్టు విజేతగా నిలిచింది. జట్టు గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేకపోయినా మ్యాచ్ ఆఖర్లో కోహ్లీ బౌండరీలపైనే గురి పెట్టి 92 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లు విజృంభించడంతో కోహ్లీని మినహాయించి జట్టులోని మిగతా వాళ్లెవరూ పరుగులు తీసేందుకు తీయలేకపోయారు. ఈ క్రమంలో అడపాదడపా కెప్టెన్ పరుగులు తీసేందుకు ప్రయత్నించినా సఫలీకృతం కాలేకపోయాడు. దీంతో బెంగుళూరు జట్టు ఇంకా 46 పరుగులు రావాల్సి ఉండగానే ఓవర్లు అయిపోవడంతో మ్యాచ్ ముగించేసింది.

ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. అయితే మ్యాచ్ ముగిసే సమయంలో క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా కేవలం 5 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక పాండ్యా బౌలింగ్ విషయానికొస్తే వేసిన ఒక్క ఓవర్‌లోనే వికెట్ కీపర్ గాయానికి కారణమై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Story first published: Thursday, April 19, 2018, 16:03 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X