2 వరుస వైఫల్యాల అనంతరం మాజీ కెప్టెన్‌తో పోరాడేందుకు సిద్ధమైన కోల్‌కతా

Posted By:
IPL 2018: Gautam Gambhir returns to Kolkata as KKR focus on game

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ గౌతమ్ గంభీర్. అతడు మరోసారి కోల్‌కతాకు వచ్చాడు. అయితే ఈసారి మాత్రం ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్ కెప్టెన్‌గా అతను తన మాజీ టీమ్‌కు చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌లో సోమవారం కోల్‌కతా, ఢిల్లీ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని కోల్‌కతా టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది.

రెండు మ్యాచ్‌లు ఓటమి అనంతరం:

రెండు మ్యాచ్‌లు ఓటమి అనంతరం:

ఇదే సమయంలో... రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్‌పై అనూహ్య విజయం సాధించిన ఢిల్లీ కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతుంది. బెంగళూరుపై గెలిచి టోర్నీని అద్భుతంగా మొదలుపెట్టిన కోల్‌కతా టీమ్.. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ చేతుల్లో వరుసగా ఓటమి పాలైంది. అటు ఢిల్లీ మాత్రం పంజాబ్, రాజస్థాన్ చేతుల్లో ఓడిపోయి.. ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపు బోణీ చేసింది.

ఢిల్లీకి కళ్లు చెదిరే విజయాన్ని సాధించి:

ఢిల్లీకి కళ్లు చెదిరే విజయాన్ని సాధించి:

ఆ టీమ్ ఓపెనర్ జేసన్ రాయ్ 91 పరుగులతో ఢిల్లీకి కళ్లు చెదిరే విజయాన్ని సాధించి పెట్టాడు. మరోవైపు ఢిల్లీ టీమ్‌కు ఆడుతున్న మొహమ్మద్ షమి కూడా మరోసారి తన సొంతగడ్డకు తిరిగొస్తున్నాడు. భార్య హసీన్ జహాన్‌తో వివాదం నేపథ్యంలో ఈడెన్‌లో షమి ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీ టీమ్‌పై కోల్‌కతాకు మెరుగైన రికార్డు:

ఢిల్లీ టీమ్‌పై కోల్‌కతాకు మెరుగైన రికార్డు:

ఢిల్లీ టీమ్‌పై కోల్‌కతాకు మెరుగైన రికార్డు ఉంది. ఆ టీమ్‌పై 12 మ్యాచుల్లో గెలిచి 8 మ్యాచుల్లో ఓడింది. ఇక ఈ మ్యాచ్ లో గంభీర్ తన అత్యుత్తమ ప్రదర్శన చూపించి కోల్‌కతాను ఎదుర్కొవాల్సి ఉంది. 2011వ సంవత్సరం నుంచి అదే జట్టును నడిపించిన నాయకుడు ఇప్పుడు దానికి ప్రత్యర్థి జట్టు నాయకుడిగా బరిలోకి దిగనున్నాడు. ఇక, ఢిల్లీ జట్టును ఎదుర్కొనేందుకు కోల్‌కతా జట్టు అండర్ 19 ఆటగాళ్లైన శుభమ్ గిల్, శివమ్ మావిలపై ఆధారపడాల్సి ఉంది.

దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ మీదనే అనుమానం:

దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ మీదనే అనుమానం:

గత రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలవడంతో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్న విమర్శకులకు కార్తీక్ బ్యాట్‌తో సమాధానం చెప్పాల్సిన పని ఎంతైనా ఉంది. ఇది అతని కెరీర్ లోనే అత్యంత ఒత్తిడితో కూడుకున్న జట్టు అనడంలో సందేహం లేదు.

KKR Playing XI:
Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik (c) (wk), Shubman Gill, Andre Russell, Mitchell Johnson, Shivam Mavi, Piyush Chawla, Kuldeep Yadav.

DD Playing XI:
Gautam Gambhir (C), Jason Roy, Shreyas Iyer, Rishabh Pant (wk), Glenn Maxwell, Vijay Shankar, Daniel Christian, Rahul Tewatia, Shahbaz Nadeem, Mohammed Shami, Trent Boult.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 16:05 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి