న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని క్రీజులోకి రాగానే ఆర్‌సీబీ జెర్సీ విప్పేసిన మహిళా అభిమాని (వీడియో)

By Nageshwara Rao
IPL 2018: A fan changes loyalties as MS Dhoni steps in to bat

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. కెప్టెన్‌గా... బ్యాట్స్‌మన్‌గా... వికెట్ కీపర్‌గా భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలనందించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

అంతేకాదు ఐసీసీ నిర్వహించే మూడు ప్రతిష్టాత్మక కప్‌లను(వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) అందించిన ఏకైక కెప్టెన్ ధోని. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ధోని అభిమానులను సంపాదించుకున్నాడు. వయసు మీద పడటంతో మహా అయితే ఇంక రెండేళ్ల పాటు ధోని ఆటను అభిమానులు ఆస్వాదిస్తారేమో.

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోని ప్రస్తుతం టీమిండియాకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక అభిమానులను కలిగి ఉన్న జట్లలో చెన్నై ఒకటి.

బెంగళూరు-చెన్న మ్యాచ్‌లో ఊహించని సంఘటన

బెంగళూరు-చెన్న మ్యాచ్‌లో ఊహించని సంఘటన

ఇదంతా ధోని వల్లే. ధోని ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం కూడా చెన్నైకి అభిమానులు సంఖ్య ఎక్కువగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఐపీఎల్‌లో మిగతా జట్లకు చెందిన అభిమానులు సైతం ధోనిని ఎంతగా ప్రేమిస్తారనే దానికి ఈ సంఘటనే ఓ చిన్న ఉదాహరణ. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

చెన్నై విజయ లక్ష్యం 206 పరుగులు

చెన్నై విజయ లక్ష్యం 206 పరుగులు

ఈ మ్యాచ్‌లో అప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని ఉత్సాహపరిచిన ఓ అభిమాని ధోని క్రీజులోకి రాగానే చెన్నై జట్టుని ఉత్సాహపరచడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి చెన్నైకి ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు.

జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి ధోని

జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి ధోని

తొలి ఓవర్‌లోనే ఓపెనర్ వాట్సన్ (7) వికెట్‌ని కోల్పోయిన చెన్నై.. ఆ తర్వాత హిట్టర్ సురేశ్ రైనా (11), శామ్ బిల్లింగ్స్ (9), రవీంద్ర జడేజా(3) వికెట్లని చేజార్చుకుంది. జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ధోని క్రీజులోకి రాగానే అప్పటివరకు బెంగళూరుకి మద్దతు పలికిన ఓ మహిళ అభిమాని అమాంతం చెన్నైకి మద్దతు పలికింది.

బెంగళూరు జెర్సీని తీసేసి గాల్లోకి ఊపుతూ

అంతేకాదు అప్పటివరకు తాను ధరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీని తీసేసి గాల్లోకి ఊపుతూ ధోని... ధోని... అంటూ పెద్దగా ఉత్సాహపరిచింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమె వేసుకున్న బెంగళూరు జెర్సీ కింద చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Thursday, April 26, 2018, 17:38 [IST]
Other articles published on Apr 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X