కోల్‌కతాతో మ్యాచ్‌కి డుప్లెసిస్ దూరం: ఆందోళనలు, హెచ్చరికలు

Posted By:
IPL 2018: Faf du Plessis not yet ready to play because of side strain, says CSK batting coach Michael Hussey

హైదరాబాద్: గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ డుప్లెసిస్‌ మంగళవారం సొంతగడ్డపై కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్ హస్సీ వెల్లడించాడు. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై అభిమానుల మధ్య చెన్నై సూపర్‌కింగ్స్‌ మంగళవారం తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో హస్సీ మాట్లాడుతూ 'డుప్లెసిస్‌ ఇంకా పూర్తి స్థాయి శిక్షణలో పాల్గొనడం లేదు. చేతి వేలికి గాయం ఉంది. దీంతో మంగళవారం సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లో అతడు ఆడడు. అతడు కోలుకోవడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టొచ్చు. ఏప్రిల్‌ 15న మొహాలీలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం' అని అన్నాడు.

తుది జట్టు కోసం గట్టి పోటీ

తుది జట్టు కోసం గట్టి పోటీ

'జట్టులో అంబటి రాయుడు-మురళీ విజయ్‌ల మధ్య చాలా పోటీ నెలకొంది. ఇద్దరూ చాలా బాగా ఆడుతున్నారు. ఈ ఇద్దరిలో తుది జట్టులో ఎవరికి చోటు కల్పించాలో కోచ్‌, కెప్టెనే నిర్ణయం తీసుకుంటారు. గాయం కారణంగా కీలక ప్లేయర్ జాదవ్‌ మొత్తం టోర్నీకే దూరం కావడం మా జట్టుకు ఎదురుదెబ్బ' అని హస్సీ అన్నాడు.

 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం

తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం

రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ సన్నద్ధమైంది. మంగళవారం ఆ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొనబోతోంది.

మ్యాచ్ నిర్వహిస్తే పాముల్ని వదులుతాం

మ్యాచ్ నిర్వహిస్తే పాముల్ని వదులుతాం

దీంతో కోల్‌కతాపై విజయం నమోదు చేయాలని ఊవిళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్‌కి కావేరి నదీ జలాల వివాదం అడ్డంకిగా మారింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మంగళవారం కోల్‌కతా-చెన్నై మధ్య మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియంలోకి పాముల్ని వదులుతామని ప్రో-తమిళ్ పార్టీ తమిళగ వాళ్వురిమై కచ్చి (టీవీకే) హెచ్చరించింది.

నాలుగువేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

నాలుగువేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

ఈ నేపథ్యంలో స్టేడియంలో దాదాపు నాలుగువేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్ ప్రకారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మంగళవారం రాత్రి 8 గంటలకు కోల్‌కతాతో చెన్నై జట్టు సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగనుంది. 1000 రోజుల తర్వాత చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండటం విశేషం.

మొబైల్ ఫోన్స్‌ను అనుమతి

మొబైల్ ఫోన్స్‌ను అనుమతి

ఈ మ్యాచ్‌కు నల్లదుస్తులు వేసుకొస్తే మ్యాచ్‌కి అనుమతించేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. చెపాక్ స్టేడియంలో కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌కు మొబైల్ ఫోన్స్‌ను అనుమతిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో పేర్కొంది. అలాగే చెన్నైలోని మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, వాటిలో ఎలాంటి మార్పు ఉండదని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ స్పష్టం చేశారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 17:48 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి