ఐపీఎల్ 2018: కేదార్ జాదవ్ స్థానంలో డేవిడ్ విల్లీ

Posted By:
 IPl 2018: England all-rounder David Willey set to join Chennai Super Kings

హైదరాబాద్: గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమైన కేదార్ జాదవ్ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడ డేవిడ్ విల్లీని తీసుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. ముంబైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ తొడ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ మధ్యలోనే వెళ్లిపోయాడు.

ఆ తర్వాత చివరి ఓవర్లో వచ్చి ఒక సిక్స్‌, ఒక ఫోర్‌ బాది చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆదివారం చెన్నైకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తొడ కండరాలు గాయంతో బాధపడుతోన్న కేదార్‌ జాదవ్‌ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ సీజన్ మొత్తానికి దూరమైన కేదార్ జాదవ్

ఈ సీజన్ మొత్తానికి దూరమైన కేదార్ జాదవ్

వైద్యుల సూచన మేరకు పలు స్కానింగ్‌లు నిర్వహించారు. అనంతరం వైద్యులు కేదార్ జాదవ్‌కి పూర్తిస్థాయిలో విశ్రాంతి కావాలని సూచించారు. దీంతో ఈ సీజన్‌ మొత్తానికి కేదార్ జాదవ్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో జాదవ్ స్థానాన్ని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లీతో భర్తీ చేసింది చెన్నై యూజమాన్యం.

విల్లీ ఓ ఆల్‌రౌండర్

విల్లీ ఓ ఆల్‌రౌండర్


'విల్లీ ఓ ఆల్‌రౌండర్. అందుకే జాదవ్‌కు అతనే సరైన ప్రత్యామ్నాయం' అని భావించామని చెన్నై జట్టు అధికారిక ప్రకటన చేసింది. డేవిడ్ విల్లీ బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక, కౌంటీల్లో యార్క్‌షైర్ తరుపున ఆడుతున్నాడు.

యార్క్‌షైర్ డైరెక్టర్ మార్టిన్ మోక్సన్ అసంతృప్తి

యార్క్‌షైర్ డైరెక్టర్ మార్టిన్ మోక్సన్ అసంతృప్తి

చివరి నిమిషంలో ఇలా తమ ప్లేయర్స్‌ను ఐపీఎల్ లాక్కెళ్లిపోవడంపై యార్క్‌షైర్ డైరెక్టర్ మార్టిన్ మోక్సన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇలా అయితే కౌంటీ క్రికెట్ డేంజర్‌లో పడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై మిగతా జట్ల మద్దతు కూడగడుతానని మోకన్స్ తెలిపాడు. ఓ డెడ్‌లైన్ విధించి ఐపీఎల్‌కు ప్లేయర్స్‌ను పంపకుండా నిబంధన తెచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పాడు.

సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో చెన్నై మ్యాచ్

సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో చెన్నై మ్యాచ్

రెండేళ్ల విరామం తర్వాత సొంతగడ్డపై చెన్నై జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో తలపడుతుంది. ఇప్పటికే ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబైని దాని సొంతగడ్డపై ఓడించి ఊపుమీదుంది చెన్నై. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో బ్రావో సంచలన ఇన్నింగ్స్‌తో సూపర్‌కింగ్స్‌ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 15:19 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి