ఢిల్లీలో ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు

Posted By:
IPL 2018: Delhi police arrest three men for running illegal online gambling syndicate

హైదరాబాద్: ఐపీఎల్ వీక్షకులతో పాటు వాటిపై బెట్టింగ్ వేసే వాళ్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను న్యూఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని ఓ ఇంటిని కేంద్రంగా చేసుకుని ఈ ముఠా ఆన్‌లైన్ బెట్టింగ్‌కి పాల్పడుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు.. దాడులు నిర్వహించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ 2018 సీజన్ ఆరంభం నుంచి ఈ ముగ్గురు వ్యక్తులు బెట్టింగ్‌ పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

'ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌‌పై బెట్టింగ్‌కు పాల్పడిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశాం. విచారణలో వారు ఇలా బెట్టింగ్‌‌కి పాల్పడటం ఇదే తొలిసారని అంగీకరించారు. కానీ.. ఈ ఏడాది టోర్నీ ఆరంభం నుంచి అంటే.. ఏప్రిల్ 7 నుంచి వీరు ఈ బెట్టింగ్‌కి పాల్పడుతున్నట్లు మాకు అనుమానంగా ఉంది' అని పోలీస్ ఆఫీసర్ యుద్భీర్ సింగ్ వెల్లడించారు. దాడిలో 11 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీతో పాటు ఓ డిజిటల్ రిసీవర్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2008వ సంవత్సరం మొదలైన ఐపీఎల్‌లో అప్పట్నుంచి పదకొండు సీజన్లు కావస్తున్నా.. బెట్టింగ్ వివాదం ఎక్కడో ఒకచోట కనబడుతూనే ఉంది. 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ నేరం కింద చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లు 2015 నుంచి నిషేదానికి గురైయ్యాయి. సదరు నేరానికి పాల్పడ్డ నేరస్తులను బీసీసీఐ మ్యాచ్‌లో పాల్గొనవద్దంటూ నిషేదించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 16:50 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి