న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అరుదైన రికార్డు

By Nageshwara Rao
IPL 2018: Delhi Daredevils Rishabh Pant Ends Season With Remarkable Individual Record

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో అభిమానుల నోట ఎక్కువగా వినిపించిన పేరు రిషబ్ పంత్. భారత క్రికెట్‌‌లో వికెట్ కీపర్‌గా ధోని శకం ముగియనున్న రోజుల్లో తర్వాత వెలుగులోకి వచ్చిన యువ ఆటగాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ‌డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిషబ్ పంత్ పరుగుల వరద పారించడంతో పాటు వ్యక్తిగతంగా అనేక రికార్డులు నమోదు చేశాడు.

లీగ్‌ దశ ముగిసేసరికి రిషబ్ పంత్‌ 684 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో రిషబ్ పంత్‌ మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు.

 ఈ సీజన్‌లో అత్యధిక బౌండరీలు

ఈ సీజన్‌లో అత్యధిక బౌండరీలు

ఈ సీజన్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ సీజన్‌లో లీగ్ దశ ముగిసే సరికి రిషబ్ పంత్ 14 మ్యాచ్‌ల్లో 100కు పైగా బౌండరీలు సాధించాడు. ఇందులో 37 సిక్సులు, 68 ఫోర్లు ఉన్నాయి. పంత్ తర్వాతి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ (97), అంబటి రాయుడు (85) ఉన్నారు.

 వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించిన పంత్

వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించిన పంత్

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గానూ రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించాడు. 2014లో రాబిన్‌ ఉతప్ప 660 పరుగులతో ఇప్పటి వరకు తొలిస్థానంలో ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును రిషబ్ పంత్‌ బద్దలుకొట్టాడు. అంతేకాదు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

 అత్యధిక సిక్సులు బాదిన పంత్

అత్యధిక సిక్సులు బాదిన పంత్

ఆదివారంతో లీగ్‌ దశ ముగిసే నాటికి రిషబ్ పంత్ 37 సిక్సులు బాదాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్‌ ముందున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు విజయాలనే నమోదు చేసుకున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

Story first published: Monday, May 21, 2018, 18:20 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X