న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేపాలీ క్రికెటర్‌తో కలిసి ఐపీఎల్‌లో ఆడే ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఇదే

By Nageshwara Rao
IPL 2018, Delhi Daredevils: Complete DD squad after auction

హైదరాబాద్: ఐపీఎల్ వేలం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలానికి ముందు ఆ జట్టు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018: 8 జట్లకు చెందిన పూర్తి ఆటగాళ్ల వివరాలుఐపీఎల్ 2018: 8 జట్లకు చెందిన పూర్తి ఆటగాళ్ల వివరాలు

ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపీఎల్ 11వ సీజన్‌లో టైటిలే లక్ష్యంగా యువ ఆటగాళ్లకు వేలంలో పెద్ద పీట వేసింది. వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉండటం విశేషం.

ఐపీఎల్ 11వ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యవహారిస్తున్నారు. వేలం జరిగిన రెండు రోజులు పాంటింగ్ దగ్గరుండి మరీ ఆటగాళ్లను కొనుగోలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుని రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్‌ను ఈసారి ఢిల్లీ వేలంలో రూ. 2.8 కోట్లకు సొంతం చేసుకుంది.

ఈసారి వేలంలో ఢిల్లీ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ భారీ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేసిన ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెలే కావడం విశేషం. ఇక, టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడతారన్న పేరున్న ఓపెనర్లు కొలిన్ మున్రో, జాసన్ రాయ్‌లను వేలంలో ఢిల్లీ దక్కించుకుంది.

ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న పృథ్వీ షా వచ్చే సీజన్‌లో ఢిల్లీ జట్టు తరుపున ఆడనున్నాడు. గత పదేళ్ల ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తోన్న స్పిన్నర్ అమిత్ మిశ్రాను రూ.4 కోట్లకు ఢిల్లీ వేలంలో సొంతం చేసుకుంది.

గంభీర్‌ కోసం ఏడేళ్లు నిరీక్షించాం: ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓగంభీర్‌ కోసం ఏడేళ్లు నిరీక్షించాం: ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ

ఈసారి వేలంలో ఢిల్లీ ఆసక్తి కనబర్చిన ఆటగాళ్లలో సందీప్ లమిచానే ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే నేపాల్ క్రికెటర్ అయిన సందీప్ లమిచానే ఇండియన ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి బరిలో దిగుతున్నాడు. దీంతో నేపాల్ నుంచి ఐపీఎల్‌లో ఆడనున్న తొలి క్రికెటర్‌గా సందీప్ లమిచానే అరుదైన గుర్తింపు పొందాడు. 17 ఏళ్ల సందీప్‌ను వేలంలో ఢిల్లీ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

మొత్తం జట్టు సభ్యులు - 25; బ్యాట్స్‌మెన్ - 6; బౌలర్లు - 8; వికెట్ కీపర్లు - 2; ఆల్ రౌండర్లు - 9; విదేశీ ఆటగాళ్లు - 8

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు - 3; వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 22

అత్యధిక ధర పలికిన ఆటగాడు - రిషబ్ పంత్ - రూ. 15 కోట్లు

అత్యధిక ధర పలికిన ఆటగాడు - గ్లెన్ మ్యాక్స్‌వెల్ - రూ. 9 కోట్లు

ఖర్చు పెట్టిన డబ్బు - రూ. 78.4 కోట్లు

ప్రాంఛైజీ వద్ద మిగిలిన డబ్బు - రూ. 1.6 కోట్లు

వేలం అనంతరం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు:
1. రిషబ్ పంత్ (రూ.8 కోట్లు-Retained)
2. క్రిస్ మోరిస్ (రూ.7.1 కోట్లు-Retained)
3. శ్రేయాస్ అయ్యర్ (రూ.7 కోట్లు-Retained)
4. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.9 కోట్లు)
5. గౌతమ్ గంభీర్ (రూ.2.8 కోట్లు)
6. జేసన్ రాయ్ (రూ.1.5 కోట్లు)
7. కొలిన్ మన్రో (రూ.1.9 కోట్లు)
8. మహ్మద్ షమి (రూ.3 కోట్లు)
9. కాగిసో రబాడా (రూ.4.2 కోట్లు)
10. అమిత్ మిశ్రా (రూ.4 కోట్లు)
11. పృథ్వి షా (రూ.1.2 కోట్లు)
12. రాహుల్ తివాతియా (రూ.3 కోట్లు)
13. విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు)
14. హర్షల్ పటేల్ (రూ.20 లక్షలు)
15. అవేష్ ఖాన్ (రూ.70 లక్షలు)
16. షాబాజ్ నదీమ్ (రూ.3.2 కోట్లు)
17. డేనియల్ క్రిస్టియన్ (రూ.1.5 కోట్లు)
18. జయంత్ యాదవ్ (రూ.50 లక్షలు)
19. గురుకీరత్ మన్ (రూ.75 లక్షలు)
20. ట్రెంట్ బౌల్ట్ (రూ.2.2 కోట్లు)
21. మన్‌జోత్ కల్రా (రూ.20 లక్షలు)
22. అభిషేక్ శర్మ (రూ.55 లక్షలు)
23. సందీప్ లామిచానె (20 ల‌క్ష‌లు)
24. న‌మ‌న్ ఓజా (1.4 కోట్లు)
25. స‌య‌న్ ఘోష్ (20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 17:06 [IST]
Other articles published on Jan 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X