న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హృదయం ద్రవించిపోయేలా డేర్‌డెవిల్స్ జట్టు సీఈఓ

IPL 2018: Delhi Daredevils CEO Hemant Dua leaves a heart-warming message for fans

హైదరాబాద్: కొత్త కోచ్‌గా రికీ పాయింట్, కొత్త కెప్టెన్ గంభీర్‌ల నేతృత్వంలో ఈ ఏడాది ఐపీఎల్ 11 ముగించింది ఢిల్లీ జట్టు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కథ ముగిసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ ఢిల్లీకి ఏ మాత్రం కలిసిరాలేదు. వైఫల్యాల కారణంగా కెప్టెన్సీకి గంభీర్ గుడ్ బై చెప్పగా.. శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలం కాగా.. సమష్టిగా పోరాడటంలో ఢిల్లీ చేతులెత్తేసింది.

కత్తి మీద సాము రీతిలో ఎన్ని మార్పులు చేసినా జట్టు అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. గాయాలతో మోరిస్, రబాడ లాంటి కీలక ఆటగాళ్లు దూరం కావడం పట్ల ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో హేమంత్ దువా నిరాశ వ్యక్తం చేశాడు. కానీ యువ ఆటగాళ్లు రాణిస్తుండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. బెంగళూరుతో మ్యాచ్ ముగిశాక ఆయన ఢిల్లీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

'ఇదో మరో కఠినమైన సంవత్సరం. ఢిల్లీ ఫ్యాన్స్.. మేం మళ్లీ విఫలమయ్యాం. మీ ట్వీట్లన్నీ చదివాను. జట్టు ఆటతీరును చూసి మీరెంత నిరాశ చెందారో నేను కూడా అంతే డిజప్పాయింట్ అయ్యాను. నా మాటల్ని మీరు నమ్మకపోవచ్చు. కాకపోతే అదే నిజం. మనందరం విజయాన్ని కోరుకుంటున్నాం. ఉత్తమ కోచ్‌లను తీసుకున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేశాం. వేలం తర్వాత ఈ విషయాన్ని మీరంతా అంగీకరించారు.

కానీ గాయాల కారణంగా క్రిస్ మోరీస్, కగిసో రబాడ దూరమయ్యారు. కొందరు సీనియర్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి రాణించలేక పోయారు. కానీ యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, పృథ్వీ షా, అభిషేక్, శ్రేయస్ అయ్యర్, సందీప్, మన్జోత్, సయాన్, తెవాతియా, జయంత్, హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించకపోయినప్పటకికీ ప్రయోజనం లేకుండాపోయింది. వచ్చే ఏడాది మన జట్టు బాగా ఆడుతుంది. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్'' అని హేమంత్ దువా ట్వీట్ చేశారు.

Story first published: Sunday, May 13, 2018, 17:20 [IST]
Other articles published on May 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X