న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే మ్యాచ్‌లో..: అదే ఫీల్డర్లు, 2 రిలే క్యాచ్‌లు(వీడియో)

IPL 2018, DD vs MI: Glenn Maxwell, Trent Boult combine to pull off two sensational relay catches; watch video

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ఇప్పటికే బోలెడన్ని అద్భుతమైన క్యాచ్‌లు చూశాం. వాటిలో రిలే క్యాచ్‌లు.. గాల్లోకి లేచి బౌండరీ లైన్ ఆవల పడబోయే బంతిని మెరుపు వేగంతో అందుకుని.. దాన్ని మైదానంలో ఉన్న మరో ఫీల్డర్ చేతిలోకి విసిరేస్తారు. ఇప్పటికే ఇలాంటి రిలే క్యాచ్‌లు ఈ ఐపీఎల్ సీజన్‌లో చూశాం. అయితే ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో రెండు రిలే క్యాచ్‌లు పట్టారు.

ఫీల్లర్లు మాత్రం మారలేదు

ఫీల్లర్లు మాత్రం మారలేదు

రెండు క్యాచ్‌ల సందర్భాల్లోనూ ఫీల్లర్లు మాత్రం మారలేదు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డేర్‌డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు రాణించినప్పటికీ మిడిలార్డర్ తడబడింది. వరసపెట్టి వికెట్లు పారేసుకున్న ముంబై 163 పరుగులకే ఆలౌట్ అయింది. ఇదిలా ఉంటే, సందీప్ లమిచ్చనే వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో తొలి బంతినే కీరన్ పొలార్డ్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

మెరుపువేగంతో దూసుకువచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

మెరుపువేగంతో దూసుకువచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

గాల్లోకి తేలిన బంతి లాంగ్ ఆన్ మీదుగా బౌండరీ లైన్ ఆవల పడేలా అనిపించింది. అయితే మెరుపువేగంతో దూసుకువచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ బంతిని క్యాచ్ పట్టాడు. కానీ ఆ వేగంలో బ్యాలెన్స్‌ను కోల్పోతానని గ్రహించిన మ్యాక్స్‌వెల్ బంతిని మైదానంలో ఉన్న బౌల్ట్‌కు చేతిలోకి విసిరాడు. దీంతో బౌల్ట్ క్యాచ్‌ను అందుకున్నాడు.

పొలార్డ్ క్యాచ్‌లానే అందుకున్న మ్యాక్స్‌వెల్..

పొలార్డ్ క్యాచ్‌లానే అందుకున్న మ్యాక్స్‌వెల్..

14వ ఓవర్‌లో రోహిత్ శర్మ విషయంలో ఇదే జరిగింది. హర్షల్ పటేల్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతిని రోహిత్ సిక్స్ తరలించాలని చూశాడు. అయితే ఆ బంతిని కూడా అచ్చం పొలార్డ్ క్యాచ్‌లానే అందుకున్న మ్యాక్స్‌వెల్.. మైదానంలో ఉన్న ట్రెంట్ బౌల్డ్ చేతిలోకి విసిరాడు. బౌల్ట్ క్యాచ్ పట్టుకున్నాడు. ఇక్కడ విశేషమేంటంటే ఔటైన బ్యాట్స్‌మెన్ మారారు కానీ.. రిలే క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లు మాత్రం మారలేదు. దీనికి ఒకే ఇన్నింగ్స్‌లో ఇలాంటి రెండు క్యాచ్‌లు అందుకోవడం విశేషం.

వరుసగా చేతులెత్తేశారు:

వరుసగా చేతులెత్తేశారు:

ప్లే ఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్‌ వరుసగా చేతులెత్తేశారు. కాసేపైనా పోరాడే ప్రయత్నం చేయలేక వెంట వెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్‌ లూయిస్‌ (48) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో కట్టింగ్‌ (37) పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో 11 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Story first published: Monday, May 21, 2018, 8:44 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X