న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

8 ఏళ్ల తర్వాత: కెప్టెన్‌గా తప్పుకున్న వెంటనే గంభీర్‌కి చేదు అనుభవం

By Nageshwara Rao
IPL 2018, DD vs KKR: Karthik wins toss, Delhi to bat; Gambhir not playing

హైదరాబాద్: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి ఏడు సీజన్లు కెప్టెన్‌గా ఉండి, రెండుసార్లు ఆ జట్టుని ఐపీఎల్ విజేతగా నిలిపిన గౌతమ్ గంభీర్ ప్రస్తుతం కష్ట కాలాన్నిఎదురుకుంటున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో గంభీర్‌ని జట్టు నుంచి తప్పించారు. ఫలితంగా దాదాపు 8 ఏళ్ల తర్వాత గంభీర్‌ ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌కు తొలిసారి దూరమయ్యాడు. 2010 ఐపీఎల్‌లో గంభీర్‌ చివరిసారి తుది జట్టులో చోటు కోల్పోయాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో గంభీర్‌ ఆడలేదు.

తాజాగా ఢిల్లీ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌కి దూరమయ్యాడు. అతడి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోలిన్ మున్రోని తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం ఒక మ్యాచ్‌లోనే నెగ్గి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది.

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. గంభీర్ తన కెప్టెన్సీకి రాజీమానా చేశాడు. గంభీర్ స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వెంటనే గౌతమ్ గంభీర్‌ను మ్యాచ్ నుంచి తప్పించడంతో గంభీర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు పరాజయాలకు బాధ్యతకు వహిస్తూ ఈ సీజన్‌ కోసం తనకు రావాల్సిన జీతం మొత్తాన్ని (రూ.2.8 కోట్లు) వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. జట్టు చెత్త ప్రదర్శన కారణంగా ఒక కెప్టెన్‌ ఈ విధంగా జీతం తీసుకోకుండా ఆడడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.

అయితే 'ఫ్రాంఛైజీ నుంచి ఈ సీజన్‌ కోసం ఎలాంటి జీతం తీసుకోరాదని గౌతమ్‌ నిర్ణయించుకున్నాడు. అతడికి ఢిల్లీ తరఫున ఉచితంగానే ఆడతాడు' ఢిల్లీ యాజమాన్యానికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు. ఈ మ్యాచ్‌‌‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, కొలిన్ మున్రో చక్కటి శుభారంభాన్నిచ్చారు.

ప్రస్తుతం 11 ఓవర్లకు గాను ఢిల్లీ వికెట్ కోల్పోయి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శేయాస్ అయ్యర్(7), పృథ్వీ షా (54) పరుగులతో ఉన్నారు.

Story first published: Friday, April 27, 2018, 20:57 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X