న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: CSKvDD: 13పరుగుల ఆధిక్యంతో ఢిల్లీని చిత్తు చేసిన చెన్నై

raina

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ పూణె వేదికగా పోరుకు తలపడ్డాయి.ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(9) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కోలిన్‌ మున్రో(26), శ్రేయస్‌ అయ్యర్‌(13), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(6)లు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ మొదటి పది ఓవర్లు పూర్తయ్యే సరికి 74 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది.

ఆ దశలో రిషబ్‌ పంత్‌ -విజయ్‌ శంకర్‌ల జోడితో ఇన్నింగ్స్‌ ఊపందుకుంది. వీరిద్దరూ 88 పరుగులు జోడించి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్‌ పంత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 79 పరుగులు నమోదు చేసిన తర్వాత రిషబ్‌ ఔటయ్యాడు. ఇక నాటౌట్ గా నిలిచిన విజయ్‌ శంకర్‌(54) 31 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో కడవరకూ పోరాటం సాగించినా జట్టును విజయాన్ని పొందలేకపోయాడు. ఆఖరి బంతి వరకూ పోరాటం సాగించిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.


చెన్నై దూకుడుకు ఢిల్లీ టార్గెట్ 212

20ఓవర్లో 212 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. ధోనీ షేన్ వాట్సన్ ధనాదన్ ఇన్నింగ్స్ ఆడారు. డుప్లెసిస్, షేన్ వాట్సన్‌లు ధోనీ, అంబటి రాయుడు మంచి భాగస్వామ్యాన్ని కొనసాగించారు. ధోనీ అతని ఐపీఎల్ కెరీర్‌లోనే అతి తక్కువ సమయంలో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు నెలకొల్పాడు. కేవలం 22 బంతుల్లో 5 సిక్సులు, 2 ఫోర్లు కలిపి 51పరుగులు చేశాడు. ఆఖరి బంతికి అంబటి రాయుడు పరుగు కోసం యత్నించి రన్ అవుట్ అవగా రవీంద్ర జడేజా నామమాత్రంగా క్రీజులోకి రావలసి వచ్చింది.


వాట్సన్‌ను కోల్పోయిన చెన్నై:
దూకుడు మీద అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన షేన్ వాట్సన్ వికెట్‌ను కోల్పోయింది చెన్నై జట్టు. ఓపెనర్ గా దిగి 40 బంతుల్లో 78పరుగులు చేసిన వాట్సన్ భారీ షాట్‌లను బాదుతూనే ప్లంకెట్ చేతికి చిక్కాడు.

పరుగులే లక్ష్యంగా ఆడుతున్న చెన్నై జట్టు తరపున ధోనీ, రైనా క్రీజులో ఉన్నారు.


రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై:

బౌండరీలు చేయలేకపోయినా క్రీజులో పది ఓవర్లు నిలబడి మరో ఎండ్‌లో ఉన్న షేన్ వాట్సన్ కు మంచి సహకారాన్ని అందిస్తోన్న డుప్లెసిస్ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి 10.5ఓవర్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రైనా 2 బంతులు ఆడి కేవలం ఒక పరుగు చేసి స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 96/0:

మ్యాచ్ ఆరంభంలోని తొలి బంతికే డీఆర్ఎస్ కోరిన శ్రేయాస్ అయ్యర్ నాటౌట్ గా థర్డ్ అంపైర్ ప్రకటించడంతో మ్యాచ్ మొదలైంది. ఈ నేపథ్యంలో పదో ఓవర్ పూర్తయ్యేసరికి చెన్నై జట్టు స్కోరు పరిగెడుతోంది. ఓపెనర్లుగా దిగిన షేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు ఆరంభంలో ఆచితూచి ఆడినా క్రమేపి వేగం పెంచారు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షేన్ వాట్సన్ 6సిక్సులు, 2 ఫోర్లు బాదాడు. అతనితో పాటుగా క్రీజులో ఉన్న డుప్లెసిస్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ:

ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

వరుస పరాజయాల అనంతరం ఆఖర్లో ఆశలు రేగి ఎట్టకేలకు రెండో మ్యాచ్ గెలిచాననిపించుకుంది ముంబై ఇండియన్స్. గత మ్యాచ్ ఓటమితో ముగించిన చెన్నై.. సొంత గడ్డపై జరగాల్సిన మ్యాచ్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పూణెకు తరలించగా ఢిల్లీ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది.

1
43440

లీగ్ పట్టికలో చెన్నై స్థానం 2 అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ చివరి నుంచి మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే గాయం కారణంగా దీపక్ చాహర్ మ్యాచ్ కు దూరం కావడంతో మిగిలిన జట్టుతో చెన్నై బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. దక్షిణాఫ్రికా ఆటగాడు లుంగి ఎంగిడి ఐపీఎల్‌లో చెన్నై తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. కర్ణ్‌శర్మ, డుప్లెసిస్‌, ఆసిఫ్‌ జట్టులోకి వచ్చారు.


ఆడనున్న ఇరుజట్లు:

ఢిల్లీ డేర్ డెవిల్స్:
Prithvi Shaw, Colin Munro, Shreyas Iyer (c), Rishabh Pant (wk), Glenn Maxwell, Vijay Shankar, Rahul Tewatia, Liam Plunkett, Amit Mishra, Avesh Khan, Trent Boult

చెన్నై సూపర్ కింగ్స్:
Shane Watson, Ambati Rayudu, Suresh Raina, MS Dhoni (c) (wk), Faf du Plessis, Dwayne Bravo, Ravindra Jadeja, Karn Sharma, Harbhajan Singh, KM Asif, Lungi Ngidi

Story first published: Monday, April 30, 2018, 23:51 [IST]
Other articles published on Apr 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X