న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: చెన్నై రిపోర్ట్ కార్డు: పునరాగమనాన్ని ఘనంగా చాటిన ధోనిసేన

By Nageshwara Rao
IPL 2018: Chennai Super Kings: Returned in grand style but worries persist

హైదరాబాద్: రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ధోని నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి ప్లే ఆఫ్‌కు చేరిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. ప్లేఆఫ్‌లో భాగంగా మంగళవారం ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కాగా లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఒక్క మ్యాచ్‌ని తమ సొంత మైదానం చెపాక్‌లో ఆడింది. ఆనంతరం కావేరీ జలాల వివాదం నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన సీఎస్‌కే మ్యాచ్‌లను పూణేకి తరలించిన సంగతి తెలిసిందే.

పూణె వేదికగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో చెన్నై విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై రిపోర్ట్ కార్డుని ఒక్కసారి పరిశీలిస్తే....

ఐపీఎల్ వేలం తర్వాత

బెంగళూరు వేదికగా ఫిబ్రవరిలో వేలం ముగిసిన తర్వాత చెన్నై జట్టుని 'డాడ్స్ ఆర్మీ'తో అభిమానులతో పోల్చారు. ఇందుకు కారణం జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు 30 ఏళ్లకు పైబడినవారే ఉండటం వల్ల. అయితే, ఈ సీజన్‌లో సీఎస్‌కే గెలిచిన మ్యాచ్‌లను పరిశీలిస్తే అంబటి రాయుడుని తప్పించి యువ ఆటగాళ్లతో పోలిస్తే వెటరన్ ప్లేయర్లే చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నైనే విజయం వరించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో చెన్నై విజయం వెనుక ధోని కీలకపాత్ర పోషించాడు.

చెన్నై విజయాల్లో అంబటి రాయుడు కీలకపాత్ర

చెన్నై విజయాల్లో అంబటి రాయుడు కీలకపాత్ర

ఐపీఎల్ వేలంలో చెన్నై అంబటి రాయుడిని కొనుగోలు చేసి మంచిపని చేసింది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు తరుపున ఓపెనర్‌గా షేన్ వాట్సన్‌తో కలిసి బరిలోకి దిగిన అంబటి రాయుడు చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. చెన్నై జట్టు తరుపున సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు అంబటి రాయుడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన రాయుడు 586 పరుగులు నమోదు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే లుంగి ఎంగిడి ఆడిన 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.

ఫీల్డింగ్‌లో చెన్నై పేలవ ప్రదర్శన

ఫీల్డింగ్‌లో చెన్నై పేలవ ప్రదర్శన

ఈ సీజన్‌లో సీఎస్‌కే జట్టులోని ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చారు. బంతిని చేరుకునేందుకు గాను 30 సెకన్లు ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఈ సీజన్‌లో చెన్నై ఓటమిపాలైన మ్యాచ్‌లకు గాను ధోని బౌలింగ్ విభాగంతో పాటు ఫీల్డింగ్ విభాగమే కారణమని మ్యాచ్ అనంతరం పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన డ్వేన్ బ్రావో ఈ సీజన్‌లో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ ముందు తేలిపోయి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సందర్భాలు అనేకం.

చెన్నై ముందు ఏముందంటే?

చెన్నై ముందు ఏముందంటే?

రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందున్న తక్షణ కర్తవ్యం టైటిల్ విజేతగా నిలవడం. అంతేకాదు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచి తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పాలని సీఎస్‌‌కే యాజమాన్యం భావిస్తోంది. ఈ సీజన్‌లో గనుక చెన్నై జట్టు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోతే ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్ల వయసు రీత్యా వచ్చే ఏడాది ఆ జట్టు టైటిల్ గెలవడం కష్టం. వెటరన్ ఆటగాళ్లు అయిన షేన్ వాట్సన్, ఇమ్రాన్ తాహిర్, డేవ్ బ్రావోలాంటి వాళ్లు జట్టులో ఉంటారనేది కూడా చెప్పలేం.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు:

అంబటి రాయుడు: 586 (100: 1, 50s: 3)

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్:

శార్దుల్ ఠాకూర్: 14 (Eco: 8.82, Best: 2/18)

నిరాశపరిచిన ఆటగాడు:

శామ్ బిల్లింగ్స్. ఇంగ్లాండ్‌కు చెందిన శామ్ బిల్లింగ్ ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(56) పరుగులతో అలరించగా.... ఆ తర్వాత ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Monday, May 21, 2018, 15:09 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X