న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విమానంలో సీఎస్‌కే సంబరాలు: ఎయిర్‌ హోస్టస్‌ చేతిలో ట్రోఫీ (ఫోటోలు)

By Nageshwara Rao
IPL 2018: Chennai Super Kings celebrate title win with airplane crew, visit temple with trophy - see pictures

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ముగిసింది. టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. గత ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

విమానంలో చెన్నై సూపర్ కింగ్స్ సంబరాలు

విమానంలో చెన్నై సూపర్ కింగ్స్ సంబరాలు

ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ముంబై నుంచి చెన్నైకు వచ్చే సమయంలో విమానంలో చెన్నై సూపర్ కింగ్స్ సంబరాల్లో మునిగాయి. ముంబైలో మ్యాచ్‌ ముగించుకుని సోమవారం జట్టు సభ్యులు చెన్నైకు తిరుగు పయనం అయిన సంగతి తెలిసిందే. వీరంతా జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌లో విమానంలో చెన్నైకి పయనించారు.

ముందుగానే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సిబ్బంది ఏర్పాట్లు

ముందుగానే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సిబ్బంది ఏర్పాట్లు

క్రికెటర్లు తమ విమానంలో పయనిస్తుండడంతో ముందుగానే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సిబ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. చెన్నైలో అడుగు పెట్టనున్న ధోని సేనతో కలిసి విమానంలో సంబరాలు చేసుకున్నారు. కేక్‌ కట్‌ చేసి క్రికెటర్లతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. కప్‌ను విమాన పైలట్, ఎయిర్‌ హోస్టస్‌లు ఐపీఎల్ ట్రోఫీని చేత బట్టి ఫోటోలు దిగారు.

ఆటగాళ్లకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం

ఇక, చెన్నైకి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆటగాళ్లకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ‘సీఎస్‌కే.. ధోనీ' అంటూ అభిమానులు సందడి చేశారు. ఆ తర్వాత హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆటగాళ్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీవారి సన్నిధిలో ఐపీఎల్ ట్రోఫీ

ఆ తర్వాత మంగళవారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీవారి ఆలయాన్ని పలువురు ఆటగాళ్లు, జట్టు మేనేజ్‌మెంట్‌ సభ్యులు దర్శంచుకున్నారు. జట్టు గెలుచుకున్న ఐపీఎల్‌ ట్రోఫీని వారు ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ ట్రోఫీకి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Story first published: Wednesday, May 30, 2018, 12:11 [IST]
Other articles published on May 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X