చెన్నై-కోల్‌కతా మ్యాచ్‌కు కావేరీ సెగ: రవీంద్ర జడేజాపైకి బూట్లు

Posted By:
IPL 2018: Cauvery protesters throw shoes, removed by police during CSK-KKR game in Chennai

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా చేపాక్ స్టేడియంలో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే నిరసనకారులు అడ్డుకోవడంతో కోల్‌కతా జట్టు ఆలస్యంగా స్టేడియానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

దీంతో 13 నిమిషాలు టాస్ ఆలస్యంగా ప్రారంభమైంది. కావేరీ జల వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ నిరసనకారులను నియంత్రించలేకపోయారు. మ్యాచ్‌ జరుగుతుండగా నిరసనకారులు షూ విసిరి మ్యాచ్‌కు ఆటంకం కల్పించే ప్రయత్నం చేశారు.

ఆటకు కొద్దిసేపు అంతరాయం

ఆటకు కొద్దిసేపు అంతరాయం

దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రవీంద్ర జడేజాపై బూట్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావేరి సమస్యపై పోరాడుతున్న ఓ పార్టీకి ఆ ఇద్దరు వ్యక్తులు మద్దతుదారులుగా పోలీసులు భావిస్తున్నారు. చెపాక్‌లో మ్యాచ్ ఆడనిచ్చేది లేదని టీవీకే నేత వేల్‌మురుగన్ మ్యాచ్‌కు ముందే హెచ్చరించాడు.

స్టేడియంలోకి పాముల్ని వదులుతామని హెచ్చరిక

స్టేడియంలోకి పాముల్ని వదులుతామని హెచ్చరిక

అంతేకాదు మ్యాచ్ జరిగితే స్టేడియంలోకి పాముల్ని వదులుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమోండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు సహా మొత్తం 4 వేల మందితో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు చెపాక్ స్టేడియం వద్ద నిరసనకారులు నినాదాలతో హోరెత్తించగా.. పోలీసులు భారీ భద్రత కల్పించారు.

ఉత్కంఠ పోరులో చెన్నై ఘన విజయం

ఉత్కంఠ పోరులో చెన్నై ఘన విజయం

మ్యాచ్ ఆరంభానికి ముందే నిరసనకారులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినప్పటికీ.. నిరసనకారులు మాత్రం ఆటగాళ్లపై బూట్లు విసిరి తమ గోడును వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. కాగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 11, 2018, 9:29 [IST]
Other articles published on Apr 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి