న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేలంలో హీరోలు... ఆటలో జీరోలు: ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ప్లాప్ స్టార్స్

By Nageshwara Rao
IPL 2018: Big-money players disappoint with small performances

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ సగం పూర్తి అయింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకునే జట్లుపై అభిమానులు ఓ అంచనాకు రాగా, నిష్క్రమించే టీమ్‌లపై కూడా అభిమానులు ఓ అవగాహనకు వచ్చారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తారనుకున్న ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి.

అయితే, కోట్లు కుమ్మరించి కొనుగోళ్లు చేసిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఆయా ప్రాంఛైజీలు వరుస ఓటములను చవిచూస్తున్నాయి. వేలానికి కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లు అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నారు. వారి పేలవ ప్రదర్శన జట్టు అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది.

వేలంలో భారీ దక్కించుకున్న ఆటగాళ్లు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. వేలంలో కోట్లు పలికి ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోన్న ఆటగాళ్ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.....

జయదేవ్ ఉనాద్కత్ (మ్యాచ్‌లు: 7, వికెట్లు: 4)

జయదేవ్ ఉనాద్కత్ (మ్యాచ్‌లు: 7, వికెట్లు: 4)

ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక ధర (రూ.11.5 కోట్లు) పలికిన భారత ఆటగాడు జయ్‌దేవ్‌ ఉనాద్కత్. టీ20 క్రికెట్‌ స్పెషలిస్ట్‌ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉనాద్కత్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 11.5 కోట్ల భారీ మొత్తానికి ఖరీదు చేసింది. గత సీజన్‌లో పుణె తరఫున 12 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో అదరగొట్టడంతో అదిరిపోయే ధరకు అమ్ముడుపోయిన ఉనాద్కత్‌.. ఈ సీజన్లో మాత్రం పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ అంచనాలను తలక్రిందులు చేస్తూ వికెట్లు తీసేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టిన ఉనాద్కత్.. ఇందులో మూడు వికెట్లు బుధవారం ఢిల్లీపైన తీశాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ (మ్యాచ్‌లు: 7, పరుగులు: 127)

గ్లెన్ మ్యాక్స్‌వెల్ (మ్యాచ్‌లు: 7, పరుగులు: 127)

సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లను అమాంతం మలుపు తిప్పగల ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్. కానీ అది ఒకప్పుడు ఇప్పుడు కాదేమో అనిపిస్తున్నది. వేలంలో ఒకరిని మించి ఒకరు మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఐపీఎల్‌లో మంచి అనుభవం కూడా ఉండడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ ఏం లాభం కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయిన మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఈ ఆసీస్ స్పిన్ ఆల్‌రౌండర్ 127 పరుగులే చేశాడంటే అతని ఫామ్ ఎలా ఉందో అర్థమవుతుంది. అతడి పేలవ ప్రదర్శన ఢిల్లీ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో మాక్స్‌వెల్‌ 155.95 స్ట్రయిక్‌ రేట్‌తో 17, 13, 47, 4, 12, 27, 6, 5 పరుగులు సాధించాడు. 5 వికెట్లు మాత్రమే తీశాడు.

డీఆర్సీ షార్ట్‌ (మ్యాచ్‌లు: 4, పరుగులు: 65)

డీఆర్సీ షార్ట్‌ (మ్యాచ్‌లు: 4, పరుగులు: 65)

ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో మెరుపులు మెరిపించిన ఆటగాడు. ఆ ప్రదర్శనతోనే ఆస్ట్రేలియా టీ20 టీమ్‌లో చోటు సంపాదించాడు. రాజస్థాన్ రాయల్స్ కనీస ధరకు 20 రెట్లు అధికంగా వెచ్చించి రూ.4 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‌లో మాత్రం షార్ట్‌ తనదైన ప్రదర్శన చేయలేక పోయాడు. రాజస్థాన్ తరఫున ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 4, 6, 11, 44 పరుగులతో మొత్తంగా 65 పరుగులకు పరిమితమయ్యాడు. మరి రానున్న మ్యాచ్‌ల్లోనైనా రాణిస్తాడా లేదా అన్నది ఆసక్తికరం.

కీరన్ పొల్లార్డ్ (మ్యాచ్‌లు: 7, పరుగులు: 76)

కీరన్ పొల్లార్డ్ (మ్యాచ్‌లు: 7, పరుగులు: 76)

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరి ముచ్చటపడి వేలం లో రూ.5.40 కోట్లకు రైట్ టు మ్యాచ్ ద్వారా సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్‌లో ఎంతో కీలక ఆటగాడు పొలార్డ్‌. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్నా.. ఈ సీజన్‌లో ఇంత వరకు ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు. గతంలో ప్రదర్శనలను లెక్కలోకి తీసుకున్న ముంబైకి పొల్లార్డ్ ఈ సీజన్‌లో మాత్రం భారంగా మారిపోయాడు. పరుగులు సాధించడంలో ఘోరం గా విఫలమవుతూ ప్రత్యర్థికి ఉన్నఫళంగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. కానీ పొలార్డ్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 28, 0, 5, 21, 9, 13 పరుగులు మాత్రమే చేశాడు. అతడు 50కి పైగా పరుగులు చేస్తే.. ఆ మ్యాచ్‌ల్లో 75 శాతం ముంబైదే విజయం. మే 24, 2015 నుంచి ఇప్పటిదాకా ముంబై తరఫున పొల్లార్డ్ 7.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడంటే అతన్ని ఓ బ్యాట్స్‌మన్‌గానే పరిగణిస్తున్నది. కానీ ఈ సీజన్‌లో మాత్రం పొలార్డ్‌ పూర్తిగా ఫామ్‌ కోల్పోయి నిరాశపరుస్తూనే ఉన్నాడు.

ఆరోన్ ఫించ్ (మ్యాచ్‌లు: 6, పరుగులు: 24)

ఆరోన్ ఫించ్ (మ్యాచ్‌లు: 6, పరుగులు: 24)

ఆస్ట్రేలియా తరఫున ఎన్నో మ్యాచ్‌ల్లో ఆరోన్ ఫించ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఫించ్‌కు ఓ ప్రత్యేకంగా స్థానం ఉంది. దీని కారణంగానే ఫించ్‌ను కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ అతడి బేస్‌ ప్రైస్‌ రూ. 1.5 కోట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా రూ. 6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్‌ డక్‌గా ఫించ్‌ పెవిలియన్‌ చేరాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 24 పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 14 పరుగులు ఫించ్ అత్యుత్తమం. సహచర బ్యాట్స్‌మెన్ రాహుల్, గేల్, మయాంక్ అగర్వాల్ రాణిస్తుండటంతో ఫించ్ పేలవ ప్రదర్శనపై ఎవరి దృష్టిపడలేదు. స్థిరమైన స్థానం లేకపోవడం కూడా ఫించ్‌ ఆటతీరుపై ప్రభావం చూపిస్తోంది.

Story first published: Thursday, May 3, 2018, 12:24 [IST]
Other articles published on May 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X