సిక్సర్ల మోత: టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఆండ్రూ రసెల్

Posted By:
 Andre Russell

హైదరాబాద్: చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ పరుగుల సునామీ సృష్టించాడు. 36 బంతుల్లోనే 11 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి నాలుగు ఓవర్లలో కోల్‌కతా 64 పరుగులు రాబట్టింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఆండ్రూ రసెల్ సిక్సర్ల మోతతో ఒకానొక దశలో 89/5తో కష్టాల్లో ఉన్న కోల్‌కతా 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో ఈ సీజన్‌‌‌లో 200కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో రసెల్ 36 బంతుల్లో 88 పరుగులు చేయగా, అందులో సిక్స్‌ల రూపంలో 66 పరుగులు వచ్చాయి.

తద్వారా టీ20ల్లో తక్కువ స్కోరుకే అధిక సంఖ్యలో సిక్సు‌లు బాదిన ఆటగాడిగా ఆండ్రూ రసెల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. రసెల్‌ కొట్టిన 10 సిక్సర్లు ఒక ఎత్తయితే, బ్రేవో వేసిన ఓవర్‌లో కొట్టిన ఒక సిక్స్‌ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 17 ఓవర్‌ రెండో బంతికి రసెల్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు.

అది స్టేడియాన్ని దాటుకుని వెలుపల పడింది.. ఈ సీజన్‌లో ఇదే లాంగెస్ట్‌ సిక్స్‌గా నిలవడం మరొక విశేషం. మరో బంతి కప్పు పై భాగాన్ని తాకి తిరిగి వెనక్కి వచ్చింది. దీన్ని బట్టే అతడెంత బలంగా బంతిని బాదాడో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగానూ రస్సెల్ రికార్డు నెలకొల్పాడు.

రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 23:53 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి