సన్‌రైజర్స్ ఓటమికి కారణం చెప్పిన యువరాజ్ సింగ్

Posted By:

హైదరాబాద్: ప్రారంభ ఓవర్లలో ఎక్కువ పరుగులివ్వడం, వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా తుది జట్టులో లేకపోవడమే ఢిల్లీ డేర్‌డేవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి కారణాలని సన్‌రైజర్స్ సీనియర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ అన్నాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

మంగళవారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది.

తొలి ఆరు ఓవర్లలో మేం ఎక్కువ పరుగులిచ్చాం

తొలి ఆరు ఓవర్లలో మేం ఎక్కువ పరుగులిచ్చాం

దీంతో మ్యాచ్ అనంతరం యువరాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘తొలి ఆరు ఓవర్లలో మేం ఎక్కువ పరుగులిచ్చాం. కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ వదిలేయడం ఇక్కడ కీలకం. మేం ఆరంభంలోనే వికెట్లు తీసుంటే పరిస్థితి మరోలా ఉండేది. మా బౌలర్ల ఆరంభం బాగాలేదు. మ్యాచ్‌ మధ్యలోనూ వికెట్లు తీయలేకపోయాం. ఢిల్లీ జట్టులో అందరూ 30-40 పరుగులు చేశారు' అని యువీ అన్నాడు.

భువీ, రషీద్‌పైనే ఎక్కువ ఆధారం

భువీ, రషీద్‌పైనే ఎక్కువ ఆధారం

'మా జట్టు ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్, రషీద్‌ ఖాన్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది. నెహ్రా పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే బౌలింగ్‌ లైనప్‌ మరింత పటిష్టం అవుతుంది. మహ్మద్‌ సిరాజ్‌ యువ ఆటగాడు అతడు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. సిద్ధార్థ్‌కౌల్‌ బాగా నేర్చుకుంటున్నాడు. వారిద్దరూ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు' అని యువరాజ్ చెప్పాడు.

మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది

మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది

'ఈ మ్యాచ్‌లో మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది. గత మూడు నాలుగు ఇన్నింగ్స్‌లో మిడిల్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్ చేసేందుకు సమయం లభించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మేం బ్యాటింగ్ చేసినప్పుడు, బౌలింగ్‌లో బంతిపై మా బౌలర్లు పట్టుని సాధించలేకపోతున్నారు. దీంతో 16వ ఓవర్ తర్వాత భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు' అని యువీ అన్నాడు.

41 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యువీ

41 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యువీ

కాగా మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించాడు. యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 70 నాటౌట్;11 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువీ.. చివరి ఓవర్లలో ఫోర్లతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.

Story first published: Wednesday, May 3, 2017, 15:08 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి