ఈసారి వదిలి పెట్టలేదు: మెక్‌కల్లమ్ సూపర్ క్యాచ్ (వీడియో)

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెండన్ మెక్‌కల్లమ్ అద్భుత క్యాచ్‌ని అందుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ పట్టిన అద్భుత క్యాచ్ టోపీ వల్ల నిష్ప్రయోజనంగా మారిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

అప్పటి మ్యాచ్‌లో క్రిస్ గేల్ కొట్టిన బంతిని ఫోర్ లైన్ వద్ద అద్భుతంగా ఒడిసిపట్టినా బౌండరీ లైన్‌కు టోపీ తాకడంతో గేల్‌ బతికి పోయాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ 38 బంతుల్లో 77 పరుగులు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే గురువారం చిన్నస్వామి స్టేడియంలో మెక్‌కల్లమ్‌కు ఎదురైంది.

అయితే ఈసారి బౌండరీ లైన్ దాటినప్పటికీ క్యాచ్‌ను ఒడిసిపట్టిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ను జేమ్స్‌ ఫల్క్‌నర్‌ వేశాడు. నాలుగో బంతిని బ్యాట్స్‌మన్‌ శ్రీనాథ్‌ అరవింద్‌ లాంగాన్‌ దిశగా బాదాడు.

గాల్లోకి లేచిన బంతిని అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న మెక్‌కల్లమ్ వెనక్కి అడుగులేస్తూ ఒడిసి పట్టాడు. బ్యాలెన్స్‌ ఆపుకోలేక బౌండరీ దాటేశాడు. అయితే అంతకముందే చాకచక్యంగా బంతిని పైకి విసిరేసి మళ్లీ బయటికి వచ్చి దానిని క్యాచ్‌గా అందుకొని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు ఔరా అనిపించాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున చిన్నస్వామిలో ఆడిన మెక్‌కల్లమ్ తన 100వ మ్యాచ్‌ని గుజరాత్‌ లయన్స్ తరఫున అదే చిన్నస్వామి స్టేడియంలో ఆడటం విశేషం. తన 100వ మ్యాచ్‌లో మెక్ కల్లమ్ మూడు పరుగులే చేయడం విశేషం.

Story first published: Friday, April 28, 2017, 15:40 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి