10 రన్స్‌కే 3 వికెట్లు: స్టోక్స్ సెంచరీతో పూణె గెలిచిందిలా (ఫోటోలు)

Posted By:

హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. వేలంలో బెన్ స్టోక్స్‌ను పూణె ప్రాంచైజీ రూ. 14.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత బెన్ స్టోక్స్ ఆ స్థాయి మేరకు ఆడిన దాఖలు లేదు.

కానీ సోమవారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తానెంటో చూపించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌పై రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. అద్భుతమైన సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు.

19.5 ఓవర్లలో 161 పరుగులకు గుజరాత్ ఆలౌట్

19.5 ఓవర్లలో 161 పరుగులకు గుజరాత్ ఆలౌట్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 19.5 ఓవర్లలో 161 పరుగులు చేసి అలౌటైంది. గుజరాత్ ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెకల్లమ్‌ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి గుజరాత్‌కు శుభారంభం అందించారు.

లయన్స్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన ఇమ్రాన్ తాహిర్

లయన్స్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన ఇమ్రాన్ తాహిర్

ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ దెబ్బతీశాడు. జోరుమీదున్న కిషన్‌తో పాటు ఫించ్‌ (13), డ్వేన్‌ స్మిత్‌ (0)లను అవుట్‌ చేయడంతో లయన్స్‌ ఇన్నింగ్స్‌ తడబడింది. రైనా (8) రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన వారంతా ఒకట్రెండు బౌండరీలతో అలరించారు తప్ప ఎవరూ ఆదుకోలేకపోయారు.

రాణించిన దినేశ్‌ కార్తీక్‌, జడేజా

రాణించిన దినేశ్‌ కార్తీక్‌, జడేజా

దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు), జడేజా (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) కాసేపు ధాటిగా ఆడటంతో గుజరాత్‌ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. పూణె బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, ఉనాద్కట్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె తొలి 6 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయింది.

10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పూణె

10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పూణె

ఆ మరుసటి ఓవర్‌లో మరో వికెట్‌ ఇలా... రహానే (4), స్మిత్‌ (4), తివారి (0) అవుటయ్యారు. దీంతో 10 పరుగులకే పూణె 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ 103 నాటౌట్‌(63 బంతులు, ఆరు సిక్సులు)కు జత కలిసిన ధోని 26(33 బంతులు, ఒక సిక్సు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

38 బంతుల్లో బెన్ స్టోక్స్ అర్ధసెంచరీ

38 బంతుల్లో బెన్ స్టోక్స్ అర్ధసెంచరీ

38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన బెన్ స్టోక్స్‌... ధోని (26)తో ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం లక్ష్యాన్ని భారీ సిక్సర్లతో సులువు చేశాడు. ఈ సమయంలో ధోని అవుటయ్యాడు. ఈక్రమంలో ఒక్కసారిగా విజృంభించిన స్టోక్స్‌ భారీ షాట్లతో లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

చివర్లో పట్టేసిన కండరాలు

చివర్లో పట్టేసిన కండరాలు

చివరి ఓవర్‌కు ముందు కండరాలు పట్టేయడంతో కాసేపు విలవిల్లాడిన స్టోక్స్‌ ఆఖరి ఓవర్లో 61 బంతుల్లో సెంచరీని పూర్తి చేసి మరో బంతి మిగిలివుండగానే పూణెకి విజయాన్ని అందించాడు. స్టోక్స్ (63 బంతుల్లో 103 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో పుణెకు గుజరాత్‌పై ఇదే తొలి విజయం.

Story first published: Tuesday, May 2, 2017, 15:37 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి