న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2017: 15 పరుగుల తేడాతో ఢిల్లీ పై బెంగళూరు విజయం

ఐపీఎల్ 10లో ఇది అయిదో మ్యాచ్. 158 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లతో బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

By Ramesh Babu

బెంగళూరు: బెంగళూరు: ఐపీఎల్‌ పదో సీజన్‌ని ఓటమితో ఆరంభించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. మరోవైపు సీజన్‌లో తొలి మ్యాచ్‌కు ఆడేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఉత్సాహంగా ఉంది.

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో పరాభవం ఎదుర్కొన్న ఈ జట్టు కొన్ని మార్పులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌, అనికేత్‌, బేబీ, అరవింద్‌లను తప్పించి వారి స్థానంలో బిల్లీ, విష్ణు వినోద్‌, నేగి, అబ్దుల్లాను తుది జట్టులోకి తీసుకుంది.

మరోవైపు జహీర్‌ఖాన్‌ సారథ్యంలోని ఢిల్లీ డేర్ డెవిల్స్ సైతం కీలక విదేశీ ఆటగాళ్లు బిల్లింగ్స్‌, కమిన్స్‌, మోరీస్‌, బ్రాత్‌వైట్‌ను తుదిజట్టులోకి తీసుకొంది.

cris gayle

ఢిల్లీ బ్యాటింగ్

- 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై విజయం సాధించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.

- ఆఖరి ఓవర్ మొదటి బంతికే వికెట్ పడింది. నేగీ బౌలింగ్ లో రిషబ్ పాంట్ ఒౌటై వెనుదిరిగాడు.

- స్కోరు 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు చేరుకుంది. ఢిల్లీ జట్టు గెలవాలంటే 8 బంతుల్లో 19 పరుగులు సాధించాల్సి ఉంది.

- ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తీవ్ర ఒత్తడిని ఎదుర్కొంటోంది. బెంగళూరు బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ తో బ్యట్స్ మన్లను బాగా నియంత్రిస్తున్నారు.

- 16. 2 ఓవర్ల వద్ద వాట్సన్ బౌలింగ్ లో కుమ్మిన్స్ ఔటయ్యాడు.

- 15 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

- 9 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు 3 వికెట్ల నష్టానికి 70 పరుగులే సాధించింది.

- ఆ తరువాత వచ్చిన శాంసన్, పాంట్ లు కూడా కొద్దిపాటి పరుగులతో వెనుదిరగడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ తీవ్ర ఒత్తిడికి లోనైంది.

- 25 పరుగులు సాధించిన బిల్లింగ్స్.. 7.3 ఓవర్ల వద్ద ఇక్బాల్ అబ్దుల్లా బౌలింగ్ లో ఔటయ్యాడు. స్టాన్ లేక్ ఓ అద్భుతమైన క్యాచ్ తో బిల్లింగ్స్ ను పెవిలియన్ ముఖం పట్టించాడు.

- 6.5 ఓవర్లు గడిచాక కాని తొలి సిక్స్ కొట్టలేకపోయారు. మొదటి సిక్స్ బిల్లింగ్స్ ఖాతాలో పడింది.

- బెంగళూరు జట్టు పటిష్టమైన బౌలింగ్ ధాటికి ఢిల్లీ జట్టు ఇబ్బంది పడుతోంది. 7.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.

- ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా టేర్, బిల్లింగ్స్ ఆట మొదలుపెట్టారు.

బెంగళూరు బ్యాటింగ్

- ఢిల్లీ డేర్ డెవిల్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 158 పరుగులు చేయాల్సి ఉంది.

- ఆ తరువాత వచ్చిన మిల్స్ కూడా త్వరగానే అవుటవడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

- ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన నేగీ 10 పరుగులకే మోరిస్ బౌలింగ్ లో అవుటైపోయాడు.

- చిచ్చర పిడుగులా చెలరేగిన కేదర్ జాదవ్ అవుటయ్యాక బెంగళూరు జట్టు తీవ్ర ఒత్తిడికి లోనైంది.

- జాదవ్ అవుటవడంతో బెంగళూరు జట్టు జోరుకు బ్రేక్ పడింది. ఆ తరువాత వచ్చిన నేగీ కాస్త నిదానంగా ఆడడంతో బెంగళూరు 18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

- జహీర్ ఖాన్ బౌలింగ్ లో కేదార్ జాదవ్ అవుటయ్యాడు. జాదవ్ పెవిలియన్ ముఖం పట్టడంతో అతడి స్థానంలో నేగీ బరిలోకి దిగాడు.

- బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

- కేదార్ జాదవ్ మొత్తం 5 ఫోర్లు, 5 సిక్స్ లు కొట్టాడు. కానీ దురదృష్టం వెంటాడింది. పదహారో ఓవర్ చివర్లో జాదవ్ అవుటైపోయాడు.

- బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆటగాడు కేదార్ జాదవ్ చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నాడు. 35 బంతుల్లో 69 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.

- దీంతో 74/3 వద్ద ఉన్న బెంగళూరు జట్టు స్కోర్ 98/3కు చేరింది. జాదవ్ స్కోర్ 15 నుంచి 39కి చేరింది.

- అమిత్ మిశ్రా వేసిన 13వ ఓవర్‌లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్‌లో వరుసగా 2,6,4,4,2,6 బాది 24 పరుగులు జాదవ్ రాబట్టాడు.

- నత్త నడకలా సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్‌కు కేదార్ జాదవ్ బూస్ట్ ఇచ్చాడు.

- పది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేసింది.

- జహీర్ సారధ్యంలో డిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు పరుగులు కట్టడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

- దీంతో కేదార్ జాదవ్ (10) కు, స్టువర్ట్ బిన్నీ జతకలిశాడు. వీరిద్దరూ బెంగళూరును ఆదుకుంటే ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేస్తుంది.

- ఈ దశలో కెప్టెన్ షేన్ వాట్సన్ జాగ్రత్తగా ఆడాడు. అయితే వాట్సన్ ను నదీమ్ పెవిలియన్ కు పంపాడు.

- తరువాత మన్ దీప్ సింగ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు కానీ అనూహ్యంగా కుమ్మిన్స్ అతడిని పెవిలియన్ కు పంపాడు.

- గేల్ రెండో మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. నాలుగో ఓవర్ రెండో బంతికే అవుటయ్యాడు. 8 బంతుల్లో 1 ఫోర్‌తో ఆరు పరుగులు చేశాడు.
- క్రిస్ గేల్ - షేన్ వాట్సన్ ఓపెనర్లుగా వచ్చారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X