ఐపీఎల్: వార్నర్ విధ్వంసం, కోల్‌కతాపై ఘన విజయం

Posted By:

హైదరాబాద్: సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై ఎదురన్నదే లేకుండా పోయింది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 48 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

కోల్‌కతా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ నరైన్(1), గంభీర్(11) ఘోరంగా విఫలం కాగా, మిడిల్‌లో ఉతప్ప(53), మనీశ్ పాండే(39) ఆకట్టుకున్నారు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ (2/26)తో పాటు భువనేశ్వర్(2/29), కౌల్(2/26) రెండేసి వికెట్లు తీయగా, రషీద్‌ఖాన్(1/38)కు ఓ వికెట్ దక్కింది.

విధ్వంసక సెంచరీతో విరుచుకుపడ్డ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో హైదరాబాద్ 13 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌

ఐపీఎల్‌ పదో సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌కు వరణుడి అడ్డంకి తొలిగింది. కోల్‌కతా జట్టు స్కోరు 52 పరుగుల వద్ద వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. దాదాపు 40 నిమిషాల తర్వాత వర్షం ఆగింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను కొనసాగించిన అంపైర్లు ఓవర్లను కుదించలేదు.

వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్

నగరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం గ్రౌండ్ స్టాఫ్ మైదానంలో కవర్స్ కప్పారు. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మ్యాచ్ ఆగిపోయే సమయానికి 7 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది.

మ్యాచ్ గెలవాలంటే ఇంకా 78 బంతుల్లో 158 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో రాబిన్ ఊతప్ప 22, మనీష్ పాండే 18 పరుగులతో ఉన్నారు.

కోల్‌కతా విజయ లక్ష్యం 210

నగరంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 210 పరుగులుగా నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (126) విశ్వరూపం ప్రదర్శించాడు.

ఈ మ్యాచ్‌లో వార్నర్ బౌండరీలతో చెలరేగిపోయాడు. అటు ఫాస్ట్ బౌలర్లు, ఇటు స్పిన్నర్లు అని కనికరం లేకుండా పరుగుల మోత మోగించా. 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 126 పరుగులతో సెంచరీ చేశాడు. సన్ రైజర్స్ ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు.

Rampaging Kolkata elect to chase against defiant Hyderabad

శిఖర్ ధావన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తే, మరొకవైపు వార్నర్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే 20 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన వార్నర్.. ఆపై మరో 23 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్ 139 పరుగులు జోడించిన తర్వాత ధావన్ అవుటయ్యాడు. అనవసరపు పరుగు కోసం యత్నించిన శిఖర్ ధావన్‌ను కుల్దీప్ యాదవ్ రనౌట్ చేశాడు.

దాంతో 12.3 ఓవర్ల వద్ద సన్ రైజర్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ వేసిన 16 ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్ల సాధించి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అదే క్రమంలో పదిహేడో ఓవర్ రెండో బంతిని భారీ షాట్‌కు యత్నించిన వార్నర్ అవుటయ్యాడు. దాంతో 171 పరుగుల వద్ద సన్ రైజర్స్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ (40) రాణించగా, యువరాజ్ సింగ్ (6 నాటౌట్) రాణించారు.

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ సొంత మైదానం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతుంది.

దీపక్‌ హుడా, నెహ్రా స్థానంలో బిపుల్‌శర్మ, సిరాజ్‌ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గత నాలుగు మ్యాచుల్లో సొంతగడ్డపై హైదరాబాద్ విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా విజయం సాధించింది. దీంతో ఆ లెక్కను హైదరాబాద్ సరిచేయాలని భావిస్తోంది.

Rampaging Kolkata elect to chase against defiant Hyderabad

ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్లలో కోల్ కతా ఒకటి. ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. మరొవైపు సన్ రైజర్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించింది.

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, హెన్రిక్స్, యువరాజ్ సింగ్, నమాన్ ఓజా, బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషిద్ ఖాన్, సిద్ధార్ధ్ కౌల్, మొహ్మద్ సిరాజ్

కోల్ కతా నైట్ రైడర్స్: గౌతం గంభీర్(కెప్టెన్), సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, షెల్డాన్ జాక్సన్, గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, కౌల్టర్ నైల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్

Story first published: Sunday, April 30, 2017, 20:28 [IST]
Other articles published on Apr 30, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి