మ్యాచ్ 34 హైలెట్స్: ప్లే ఆఫ్స్ నుంచి బెంగళూరు అవుట్

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో బెంగళూరు మరో ఘోర ఓటమి చవిచూసింది. పూణెతో జరిగిన మ్యాచ్ లో కోహ్లి సేన 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

అయితే ఛేజింగ్‌లో తడబడిన ఆర్‌సీబి మరోసారి తక్కువ పరుగులు మాత్రమే చేయగలిగి చేతులెత్తేసింది. తాజా ఓటమితో బెంగళూరు నాకౌట్ ఆశలు గల్లంతైనట్టే. 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.

 Bangalore

బెంగళూరు ఆటగాళ్లలో కోహ్లీ(55) మినహా ఎవరూ రాణించలేదు. బెంగళూరు జట్టులో పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారంటే బెంగళూరు పేలవ ప్రదర్శన ఎలా సాగిందో అర్ధం చేసుకోండి. పుణె బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ 3, ఫెర్గుసన్ 2 వికెట్లు తీయగా ఉనాడ్కట్, డానియేల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

పూణె Vs బెంగళూరు మ్యాచ్ హైలెట్స్:

* టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
* పూణె తరుపున రహానే, త్రిపాఠి ఇన్నింగ్స్ ప్రారంభించారు.
* నాలుగో ఓవర్‌లో 6 పరుగుల వద్ద రహానే వెనుదిరిగాడు.
* పవన్ నేగీ వేసిన 9వ ఓవర్‌లో 37 పరుగుల వద్ద త్రిపాఠి అవుటయ్యాడు.
* మూడో వికెట్‌కు స్మిత్, మనోజ్ తివారీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* 32 బంతుల్లో స్టీవ్ స్మిత్ 45 పరుగులు చేశాడు. చివరకు స్టువర్ట్ బిన్నీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
* తివారీ 35 బంతుల్లో 44 పరుగులు చేశాడు.
* ధోని 17 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
* బెంగళూరు తరుపున ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
* 48 బంతుల్లో విరాట్ కోహ్లీ 55 పరుగులు చేశాడు.
* పూణె తరుపున ఫెర్గూన్సన్ (2/7, 4 ఓవర్లు) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
* ఇమ్రాన్ తాహిర్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 18 పరుగులిచ్చాడు.
* బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.
* బెంగళూరుపై పూణె 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* ఈ ఓటమితో బెంగళూరు నాకౌట్ నుంచి తప్పుకుంది.
* మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఫెర్గూన్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Saturday, April 29, 2017, 21:14 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి