ఐపీఎల్: చిత్తుగా ఓడిన బెంగళూరు, 10మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో బెంగళూరు మరో ఘోర ఓటమి చవిచూసింది. పూణెతో జరిగిన మ్యాచ్ లో కోహ్లి సేన 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.

Bangalore win the toss and elect to field first

ఈ సీజన్‌లో కోహ్లీ సేనకు ఇది ఏడో ఓటమి. తాజా ఓటమితో బెంగళూరు నాకౌట్ ఆశలు గల్లంతైనట్టే. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే (48 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్) కాస్తంత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. బెంగళూరు జట్టులో పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారంటే బెంగళూరు పేలవ ప్రదర్శన ఎలా సాగిందో అర్ధం చేసుకోండి.

రెండో ఓవర్‌లో ప్రారంభమైన బెంగళూరు పతనం ఏ దశలోననూ కుదురుకోనీయలేదు. బెంగళూరు ఆటగాళ్ల పతనాన్ని మరో ఎండో నుంచి విరాట్ కోహ్లీ అలా చూస్తుండిపోయాడు. పూణె బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ మూడు వికెట్లు తీయగా, ఫెర్గ్యుసన్‌కు రెండు, ఉనాద్కత్, వాషింగ్టన్ సుందర్‌లకు తలో వికెట్ దక్కింది.

బెంగళూరు విజయ లక్ష్యం 158

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుతు బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు విజయ లక్ష్యం 158 పరుగులుగా నిర్దేశించింది.

పూణె ఓపెనర్ రహానే (6) పరుగుల వద్ద 3.1వ ఓవర్‌లో బద్రి బౌలింగ్‌లో మిల్నేకి క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠితో కలిసి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. అరవింద్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌ బాదాడు.

పవర్‌ప్లే ముగిసే సరికి పుణె వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 58 పరుగుల వద్ద రాహుల్ త్రిపాఠి (28 బంతుల్లో 37; 4 ఫోర్లు, ఒక సిక్సు) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనోజ్ తివారీ, స్టీవ్ స్మిత్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్టువర్ట్ బిన్నీ వేసిసన 14 ఓవర్ చివరి బంతికి స్మిత్ అవుట్ అయ్యాడు. దాంతో పుణె స్కోరులో వేగం తగ్గింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని (17 బంతుల్లో 21; ఒక ఫోర్, ఒక సిక్సు)తో రాణించడంతో పూణె 157 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో శామ్యూల్ బద్రీ, పవన్ నేగీ, బిన్నీ తలో వికెట్ తీసుకున్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు పూణె, బెంగళూరు జట్ల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

IPL 2017: Match 34: Bangalore win the toss and elect to field first

ప్లే ఆఫ్‌కి చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి. క్రిస్ గేల్, మన్‌దీప్‌, అంకిత్‌ చౌదరి స్థానంలో బిన్నీ, సచిన్‌ బేబి, మిల్నే బెంగళూరు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక పూణె జట్టులో శార్దూల్‌ ఠాకూర్‌, డుప్లెసిస్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌, ఫెర్గ్యూసన్‌‌లకు చోటు లభించింది.

గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన పూణె ఈసారైనా ప్లేఆఫ్‌ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క విజయం కోసం ఎదురు చూపులు చూస్తోంది. ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తున్న బెంగళూరు 5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. పూణె విషయానికి వస్తే ఎనిమిది మ్యాచుల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
V Kohli, TM Head, AB de Villiers, K Jadhav, S Baby, S Binny, P Negi, A Milne, S Badree, Y Chahal, S Arvind

రైజింగ్ పూణె సూపర్ జెయింట్:
A Rahane, R Tripathi, S Smith, MS Dhoni, M Tiwary, D Christian, W Sundar, L Ferguson, J Unadkat, D Chahar, I Tahir

Story first published: Saturday, April 29, 2017, 15:49 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి