బాధ్యత తీసుకోండి: సహచర ఆటగాళ్లపై కోహ్లీ తీవ్ర అసహనం

Posted By:

హైదరాబాద్: ఎప్పుడూ పాజిటివ్ క్రికెట్‌ను ఆడితేనే విజయాలను సొంతం చేసుకుంటామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచరులకు సూచించాడు. గురువారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన తరువాత కోహ్లీ తీవ్ర అసహనం వ్కక్తం చేశాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతీసారి ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శనతో మ్యాచ్‌లు గెలవాలేమని విషయం తెలుసుకోవాలంటూ జట్టు ఆటగాళ్లకు చురకలంటించాడు. ఎప్పుడైనా సమిష్టి ప్రదర్శన అనేది గెలుపుకు ముఖ్యమని, దాని కోసం శ్రమించకపోతే ఇదే తరహాలో మరిన్ని ఓటములు చూడాల్సి వస్తుందని చెప్పాడు.

Virat Kohli

ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు బెంగళూరు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్ధానంలో ఉంది. అంతేకాదు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బెంగళూరు జట్టు బలం బ్యాటింగ్. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న బెంగళూరు జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేయడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాత్ లయన్స్ బెంగళూరుపై విజయం సాధించి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఆలౌటైంది.

'ఎప్పుడూ పాజిటివ్ క్రికెట్ ను ఆడితేనే విజయాలను సొంతం చేసుకుంటాం. ప్రదర్శనలు ఇంత చెత్తగా ఉంటే ఓటములు వెంటాడతాయి. గేమ్ లను కోల్పోవడం కూడా ఎప్పుడూ సులభం కాదు. రాత్రి ఓటమి గురించి మాత్రమే మాట్లాడటం లేదు. అంతకుముందు కూడా మా జట్టు పరిస్థితి ఇలానే ఉంది. గెలవాలనే కసి ఆటగాళ్లలో కనిపించడం లేదు. ఒకరిద్దరు చలవతో మ్యాచ్ లు గెలవడం పదే పదే సాధ్యం కాదు. సమష్టి కృషి అవసరం. గుజరాత్ చాలా బాగా ఆడింది. మా కంటే అన్ని విభాగాల్లో బాగా రాణించారు కాబట్టే ఆ జట్టు గెలిచింది' అని కోహ్లీ పేర్కొన్నాడు

Story first published: Friday, April 28, 2017, 18:22 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి