'ఒక్క సెంచరీతో రూ.14.5 కోట్లకు న్యాయం చేశాడు'

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఆటగాడు బెన్‌స్టోక్స్‌పై ఆ జట్టు సారథి స్టీవ్‌స్మిత్‌ ప్రశంసలు కురిపించాడు. బెన్ స్టోక్స్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, అతని ప్రైజ్ టాగ్‌కు తగిన న్యాయం చేశాడని కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయ పడ్డాడు.

సోమవారం రాత్రి గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుని ఒంటి చేత్తో బెన్ స్టోక్స్ గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ (63 బంతుల్లో 103 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ ప్రదర్శనపై పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. 'మేము చక్కని ఆరంభాన్ని అందించకున్నా ఎంఎస్, స్టోక్స్ రాణించారు. ఈ గ్రౌండ్ లో సిక్స్ లను సులభంగా కొట్టవచ్చు దీన్ని స్టోక్స్ సమర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు. స్టోక్స్ దాటిగా ఆడటమే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్' అని అన్నాడు.

IPL 2017: Ben Stokes 'earned his cash' with ton, says Steve Smith

'గుజరాత్‌ను సాధారణ లక్ష్యం (161) కట్టడి చేయడంలో బౌలర్లు కృషి ఎంతో ఉంది. మా స్పిన్ బౌలింగ్ విభాగం బలంగా లేకున్నా పేసర్లు రాణించారని, తొలి ఆరు ఓవర్లో పరుగులను కట్టడి చేశాం' అని స్టీవ్ స్మిత్ తెలిపాడు. తాము సరైన సమయంలో పుంజుకున్నామని స్మిత్ పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయని, వీటిలో రాణిస్తామని స్టీవ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఐఎల్ వేలంలో బెన్ స్టోక్స్‌ను పూణె ప్రాంఛైజీ రూ. 14.5 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ సెంచరీ చేసి ఒంటి చెత్తో మ్యాచ్ గెలిపించాడు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె టాపర్డర్ చేతులెత్తయడంతో ధోనితో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పూణె ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు. దీంతో బెన్ స్టోక్స్ ఆటతీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 'స్టోక్స్ ఆటతీరుకు చాలా సంతోషించాం. ఒత్తిడి మధ్య అదొక అద్భుత ఇన్నింగ్స్‌. తన టైమింగ్‌కు న్యాయం చేస్తూ సొగసుగా ఆడాడు. మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు' అని స్మిత్ అన్నాడు.

'బెన్ స్టోక్స్‌ ఖరీదైన ఆటగాడని అదనపు ఒత్తిడి అనుభవించలేదు. టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండర్లు కీలకం. బంతి, బ్యాట్‌, ఫీల్డింగ్‌లో వారు రాణిస్తారు. మిచెల్‌ మార్ష్‌ నిష్క్రమణతో స్టోక్స్‌ మాకు ఇంకా అత్యవసర ఆటగాడిగా మారాడు. తన ప్రైజ్ టాగ్‌కు తగిన న్యాయం చేశాడు' అని స్మిత్‌ అన్నాడు. తాజా విజయంతో పూణె పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.

Story first published: Tuesday, May 2, 2017, 18:55 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి