డివిలియర్స్‌లో మరో కోణం: ప్రేమలేఖలెన్నో రాశాడు (ఫోటోలు)

Posted By:

హైదరాబాద్: ఏబీ డివిలియర్స్... ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్ధి బౌలర్లకు సింహస్వప్నం. అలాంటి డివిలియర్స్‌లో కూడా ఓ ప్రేమికుడు ఉన్నాడు. తాజాగా తన స్కూల్‌డేస్‌లో ప్రేమలేఖల విషయాలను గుర్తు చేసుకున్నాడు.

స్వతహాగా సిగ్గరి అయిన డివిలియర్స్ ఎన్నో లవ్ లెటర్స్ రాసినప్పటికీ, వాటిని అమ్మాయిలకివ్వాలంటే భయపడేవాడంట. దాంతో ఆ లేఖలన్నీ అతడి ఇంట్లో ఓ పెట్టెలోనే భద్రంగా ఉండిపోయాయి. ముంబైలో మంగళవారం జరిగిన ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న డివిలియర్స్ తనలోని ఈ కోణాన్ని వెల్లడించాడు.

స్కూల్‌ డేస్‌లో రొమాంటిక్‌

స్కూల్‌ డేస్‌లో రొమాంటిక్‌

‘స్కూల్‌ డేస్‌లో నేను చాలా రొమాంటిక్‌. స్కూల్లో చదివే రోజుల్లో అందమైన అమ్మాయిని చూడగానే నాలో ప్రేమావేశం పుట్టుకొచ్చేది. వెంటనే ప్రేమలేఖ రాసేవాణ్ని. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ లేఖను ఆమెకు ఇవ్వాలంటే ఏదో భయంగా ఉండేది. దీంతో ఆ లేఖను తీసుకుని ఇంటికెళ్లి, అటకపై దాచేవాణ్ని' అని మధుర జ్ఞాపకాలను డివిలియర్స్ నెమరవేసుకున్నాడు.

30 లవ్‌లెటర్లు అటకపై పెట్టెలో ఇప్పటికీ భద్రంగా

30 లవ్‌లెటర్లు అటకపై పెట్టెలో ఇప్పటికీ భద్రంగా

'అలా నా చదువు ముగేసి సరికే 30 లవ్‌లెటర్లు అటకపై పెట్టెలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి' అని నవ్వుతూ వెల్లడించాడు. అయితే ఆ ప్రేమ లేఖల అనుభవాన్ని ఇప్పుడు డివిలియర్స్ వృథాగా ఏమీ పోనివ్వల్లేదు. తన గత అనుభవాలతో భార్యకు ప్రేమతో లేఖలు రాస్తుంటానని చెప్పాడు.

నా భార్య డానియెలెకు ప్రేమలేఖలు రాస్తున్నా

నా భార్య డానియెలెకు ప్రేమలేఖలు రాస్తున్నా

'ఇప్పుడు ఆ అనుభవాన్నంతా ఉపయోగించి నా భార్య డానియెలెకు ప్రేమలేఖలు రాస్తున్నా. ఈ మధ్యే ఆమె దక్షిణాఫ్రికాకు వెళ్లేటప్పుడు తన పాస్‌పోర్ట్‌లో ఓ లేఖ పెట్టా. విమానాశ్రయంలో ఆమె చదువుతుందని నాకు తెలుసు. చదివి ఆమె ఎంతో సంతోష పడింది. రెండో రోజుల తర్వాత ఓ సందేశం పంపింది. నా ఆ ప్రేమలేఖ తనకెంతో విలువైందని చెప్పింది' అని డివిలియర్స్‌ వివరించాడు.

ఐపీఎల్‌లో బెంగళూరు తరుపున

ఐపీఎల్‌లో బెంగళూరు తరుపున

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటివరకు పదకొండు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఎనిమిది మ్యాచ్‌ల్లో పరాజయం పాలై, కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది.

Story first published: Wednesday, May 3, 2017, 15:31 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి