న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోమాంచితం: ఒక్క పరుగుతో చెన్నై విక్టరీ, మోర్కెల్ శ్రమ వృధా

By Pratap

చెన్నై: చెన్నైపై చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో మోర్కెల్ కొట్టిన బంతి బౌండరీకి ఈవల పడి నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. తీవ్రమైన ఉత్కంఠ మధ్య చైన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మోర్కెల్ ఒంటరి పోరు చేసి, ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేసినా దురదృష్టం వెంటాడింది. అతను 55 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ తొమ్మిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చెన్నై 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో రెండు పరుగులు ఢిల్లీ వెనకబడింది.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నెహ్రా 3 వికెట్లు తీసుకోగా, బ్రేవోకు రెండు వికెట్లు దక్కాయి. మోహిత్ శర్మ, ఈశ్వర్ పాండే, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు.

చెన్నైపై విజయానికి చివరి ఆరు బంతుల్లో ఢిల్లీ 19 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. రెండు వికెట్లు చేతిలో ఉన్నాయి. డ్వైన్ బ్రేవో వేసిన తొలి బంతిని మోర్కెల్ బౌండరీ దాటించి ఫోర్ కొట్టాడు.

IPL 2015 Match 2: Delhi Daredevils opt to bowl against Chennai Super Kings

రెండో బంతికి మోర్కెల్ సింగిల్ తీశాడు. మూడో బంతిని తాహిర్ గాలిలోకి లేపాడు. సురేష్ రైనా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో తాహిర్ అవుటయ్యాడు. దీంతో 137 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

ఇంకా మూడు బంతులు మిగిలి ఉన్నాయి. 14 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో బంతిని మోర్కెల్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు తీశాడు. ఒక బంతి మిగిలి ఉంది, ఆరు పరుగులు చేయాల్సి ఉంది. అయితే చివరి బంతిని మోర్కెల్ ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. దీంతో చెన్నై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్ తన ముందు ఉంచిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ను చేజార్చుకుంది. గౌతం నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నెహ్రా బౌలింగులో పెవిలియన్‌కు చేరుకున్నాడు. 20 పరుగుల స్కోరు వద్ద ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడడానికి ప్రయత్నించి మాయాంక్ అగర్వాల్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు.

IPL 2015 Match 2: Delhi Daredevils opt to bowl against Chennai Super Kings

ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ కూడా అంత సజావుగా సాగడం లేదు. 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 7 పరుగులు చేసి నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు. ఢిల్లీ 87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కేదార్ జాదవ్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. క్రికెట్ ప్రేక్షకుల్లో యువీ క్రేజ్ కనిపించింది. యువరాజ్ మైదానంలోకి దిగగానే ఈలలూ కేకలూ ప్రారంబమయ్యాయి. అయితే, యువరాజ్ సింగ్ ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 9 పరుగులు చేసి డ్వైన్ బ్రేవో బౌలింగులో అవుటయ్యాడు.

యువీని అవుట్ చేసిన ఆనందంలో బ్రేవో డ్యాన్స్ లాంటి ప్రదర్శన ఇచ్చాడు. 99 పరుగుల వద్ద దాంతో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. ఈశ్వర్ పాండే బౌలింగులో ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ డుమినీ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో ఢిల్లీ 106 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఒంటరిపోరాటం చేస్తున్న ఎల్బీ మోర్కెల్ 43 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. 123 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ కౌల్టర్ - నీలే ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. 128 పరుగుల వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా రన్నవుట్ అయ్యాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు ఒకరి తర్వాత ఒకరు వికెట్లు తీయడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఏ సమయంలోనూ కోలుకోలేకపోయింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. విజయానికి ఢిల్లీ డేర్ డెవిల్స్ 151 పరుగులు చేయాల్సి ఉంటుంది.

IPL 2015 Match 2: Delhi Daredevils opt to bowl against Chennai Super Kings

ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లలో కౌల్టర్ నీలే మూడు వికెట్లు తీసుకోగా, డుమినీ, జోసెఫ్, అమిత్ మిశ్రా, ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ తీసుకున్నారు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన ట్వంటీ20 మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మెక్‌కుల్లం కేవలం నాలుగు పరుగులు చేసి కౌల్టర్ నీలే బౌలింగులో యువరాజ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో చెన్నై 20 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ మరో దెబ్బ తగిలింది. దూకుడుకు, నిలకడకు మారుపేరైన సురేష్ రైనా కౌల్టర్ - నీలే బౌలింగులోనే నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దాంతో 38 పరుగులు వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ వచ్చిన డ్వైన్ స్మిత్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇమ్రాన్ తాహీర్ బౌలింగులో అవుటయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ వేగంగా పరుగులు చేసే క్రమంలో వికెట్లను కోల్పోతూ వచ్చింది. వంద పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. డూ ప్లెసిస్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డుమినీ బౌలింగులో అవుటయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ 117 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమిత్ మిశ్రా బౌలింగులో అవుటయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. 120 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. డామ్నిక్స్ బౌలింగులో బ్రేవో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. మరో బంతి మిగిలి ఉండగా కౌల్టర్ నీలే బౌలింగులో ధోనీ అవుటయ్యాడు. అంతకు ముందు వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు.

ఐపియల్ ట్వంటీ20 పోటీల్లో భాగంగా జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి బౌలింగు ఎంచుకుంది. ఎంఎ చిదంబరం స్టేడియంలో ధోనీ సేన తన సొంత ప్రేక్షకుల ముందు ఆడింది.

గత సీజన్‌లో తాము చెన్నై ప్రేక్షకులను మిస్సయ్యామని, తిరిగి ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని టాస్ వేయడానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు. తాను కెప్టెన్సీ సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు డుమినీ చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, బ్రెండన్ మెక్‌కుల్లం, డ్వైన్ బ్రేవో, డ్వైన్ స్మిత్, ఫఫ్ డూ ప్లెసిస్, మట్ హెన్రీ, శామ్యూల్ బద్రీ, మైకెల్ హస్సీ, కైల్ అబోట్, ఆండ్ర్యూ టై, పవన్ నేగి, ఆశిష్ నెహ్రా, బాబా అపరాజిత్, ఈశ్వర్ పాండే, మిథను మన్హాస్, రోనిత్ మోరే, రాహుల్ శర్మ, అంకుశ్ బైన్స్, ఇర్ఫాన్ పఠాన్, ప్రత్యూష్ సింగ్, ఎకలవ్య ద్వివేది.

ఢిల్లీ డేర్ డెవిల్స్: జెపి డుమినీ (కెప్టెన్), యువరాజ్ సింగ్, మనోజ్ తివారీ, క్వింటోన్ డీ కాక్ (వికెట్ కీపర్), ఇమ్రాన్ తహీర్, నాథన్ కౌల్టర్ - నీలే, అంజిలో మాథ్యూస్, గురిందర్ సంధు, ట్రావిస్ హెడ్, ఎల్పీ మోర్కెల్, మార్కుస్ స్టోయినిస్, కేదార్ జాదవ్, మాయాంక్ అగర్వాల్, మొహమ్మద్ షమీ, అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కత్, జహీర్ ఖాన్, షాబాజ్ నదీమ్, సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సిెం గౌతం, శ్రీకర్ భరత్, కెకె జియాస్, డోమ్నిక్ జోసెఫ్

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X