న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు.. థాంక్యూ సచిన్ సర్'

IPL 2019,Final : Jasprit Bumrah Reacts To Sachin Tendulkar's 'World's Best Bowler' Praise !
IPL 20019, CSK vs MI: Speechless Jasprit Bumrah reacts to Sachin Tendulkar’s ‘world’s best bowler’ praise

ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్‌ అద్భుత విజయం సాధించింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి బంతికి మలింగ వికెట్ తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించినా.. అంతకుముందు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జఫ్రీత్ బుమ్రా అద్భుత స్పెల్ వేయడంతో ముంబై రేసులోకి వచ్చింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

4 ఓవర్లలో 14 పరుగులు:

4 ఓవర్లలో 14 పరుగులు:

చెన్నై ఓపెనర్ వాట్సన్ వరుస బౌండరీలతో దూకుడుమీదున్నాడు. మలింగ కూడా అప్పటికే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ దశలో 17వ ఓవర్లో 4 పరుగులు.. 19వ ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి ముంబై బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసాడు. ఈ స్పెల్ తో ముంబై రేసులోకి వచ్చి విజయాన్ని అందుకుంది. బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌:

మ్యాచ్ అనంతరం యువరాజ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ముంబై మెంటార్ సచిన్ మాట్లాడుతూ... 'టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఓ అద్భుతం. ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌' అని కొనియాడాడు. ఐపీఎల్‌లో యువ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ ప్రతిభ అద్భుతం అంటూ ప్రశంసించాడు.

ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు:

ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు:

అనంతరం సచిన్ ప్రశంసలపై జస్‌ప్రీత్‌ బుమ్రా స్పందించాడు. 'ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు.. థాంక్యూ సచిన్ సర్' అని సచిన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఐపీఎల్-12లో జస్‌ప్రీత్‌ 16 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి ముంబై విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అయితే బుమ్రా ఎకానమీ 6.63గా ఉండడం విశేషం.

Story first published: Tuesday, May 14, 2019, 9:59 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X