ఐపీఎల్: త్రిపాఠి అర్ధసెంచరీ, కోల్‌కతాపై పూణె ఘన విజయం

Posted By:

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

RPS win the toss and elect to field

పూణె ఆటగాళ్లలో రాహుల్ త్రిపాఠి 52 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో రాణించాడు. ఇక, మిగతా ఆటగాళ్లెవరూ 15 పరుగులు కూడా చేయక పోవడం విశేషం.

పూణె విజయ లక్ష్యం 156

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో పూణె విజయ లక్ష్యం 156 పరుగులుగా నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మేడిన్ చేసి వికెట్ తీసిన ఉనాద్కత్ ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి ఓవర్‌ను మేడిన్ చేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

దీంతో కోల్‌కతా పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్సన్.. పూణె బౌలర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఒక వైపు వికెట్లుపడుతున్న కెప్టెన్ గంభీర్ దాటిగా ఆడాడు. సుందర్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కోట్టిన గంభీర్ క్యాచ్ అవుటయ్యాడు.

దీంతో పవర్ ప్లేలో కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో కోల్‌కతా నమోదు చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్ కూడా పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత 4 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన మనీష్ పాండే క్రిస్టియన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

చివర్లో ఉనాద్కత్ వేసిన 19 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదగా... కౌల్టర్ నైల్ మరో సిక్స్ బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీసి నాలుగు పరుగులు ఇవ్వడంతో కోల్‌కతా ఎనిమిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

పుణె బౌలర్లలో ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్టియాన్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పూణె

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

IPL 10: Match 41: RPS win the toss and elect to field

ఈ మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఫామ్‌లో ఉన్న రాబిన్‌ ఊతప్ప ఆడడం లేదు. మరోవైపు పుణె జట్టులో మార్పులేమీ లేవు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటి వరకు పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన పూణె నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

గత మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌ మీద అద్భుత విజయం సాధించిన పూణె మంచి ఊపు మీద కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓడినా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అటు బౌలింగ్‌, బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కి చేరుకోవాలని కోల్‌కతా ఉవ్విళ్లూరుతోంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్:
సునీల్ నరైన్, గౌతమ్ గంభీర్, మనీశ్ పాండే, యూసఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, జాక్సన్, గ్రాండ్‌హోమ్, క్రిస్ వోక్స్, కౌల్టర్ నైల్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్

రైజింగ్ పూణె సూపర్ జెయింట్:
అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠి, స్టీవ్‌స్మిత్, మనోజ్ తివారి, బెన్ స్టోక్స్, ధోని, క్రిస్టియాన్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Wednesday, May 3, 2017, 19:50 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి