న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మరికొంత సమయం ఇవ్వాల్సింది.. తప్పుల్ని సరిచేసుకుంటున్న సమయంలో కెప్టెన్‌గా తొలగించారు'

Inzamam-ul-Haq said Sarfaraz Ahmed should have been given more time as Pakistan captain

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ జట్టు కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌ను తప్పించడాన్ని మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమాముల్‌ హక్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. పాకిస్తాన్‌ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన సర్ఫరాజ్‌ను మరి కొంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తే బాగుండేదన్నాడు. సర్ఫరాజ్‌ అనుభవం గడించి తప్పుల్ని సరి చేసుకుంటున్న సమయంలో కెప్టెన్‌గా తొలగించడం సరైన నిర్ణయం కాదని ఇంజీ అభిప్రాపడ్డాడు. సర్ఫరాజ్‌ పాక్ తరఫున 49 టెస్టులు, 116 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.

'పరుగుల వరద పారించినా.. ఎంతో మెరుగైన తర్వాత కూడా భారత జట్టులో చోటు దక్కలేదు''పరుగుల వరద పారించినా.. ఎంతో మెరుగైన తర్వాత కూడా భారత జట్టులో చోటు దక్కలేదు'

గొప్ప విజయాలను అందించాడు:

గొప్ప విజయాలను అందించాడు:

ఇంజమాముల్‌ హక్ తాజాగా ఓ పాకిస్తాన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'సర్ఫరాజ్‌ పాకిస్తాన్ క్రికెట్‌కు చాలా గొప్ప విజయాలను అందించాడు. ఎన్నో గుర్తిండిపోయే విజయాలు సర్ఫరాజ్‌ కెప్టెన్సీలో చూశాం. కొన్ని తప్పులు చేశాడు. ఆటలో అది సహజమే. అయితే సర్ఫరాజ్‌ అనుభవం గడించి తప్పుల్ని సరిచేసుకుంటున్న సమయంలో కెప్టెన్‌గా తప్పించడం బాధాకరం. సర్ఫరాజ్‌ కెప్టెన్సీలో పాకిస్తాన్‌ జట్టు చాంపియన్స్‌ ట్రోఫీని గెలవడంతో పాటు టీ20ల్లో నంబర్‌ స్థానానికి చేరింది' అని అన్నాడు.

కొంతకాలం ఓపిక పడితే బాగుండు:

కొంతకాలం ఓపిక పడితే బాగుండు:

'సర్ఫరాజ్‌ పాకిస్తాన్ జట్టుకు మంచి విజయాలను కూడా అందించాడు. కెప్టెన్‌గా మరికొంత కాలం ఉండటానికి సర్ఫరాజ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. అతనిపై నమ్మకం లేకనే పాక్‌ క్రికెట్‌ బోర్డు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తీసేసింది. పాక్ బోర్డు కొంతకాలం ఓపిక పడితే బాగుండేది. 2019 వరల్డ్‌కప్‌లో పాక్‌ క్రికెటర్లు అభద్రతా భావానికి లోను కావడంతోనే నాకౌట్‌కు చేరకుండా నిష్క్రమించాల్సి వచ్చింది. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను నిందించాల్సిన అవసరం లేదు. విపరీతమైన ఒత్తిడిని మనసులో పెట్టుకుని అందుకు మూల్యం చెల్లించుకున్నారు ' అని ఇంజీ తెలిపాడు. 2016 నుంచి 2019 వరల్డ్‌కప్‌ వరకూ పాక్‌ క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌గా ఇంజమామ్‌ సేవలందించిన విషయం తెలిసిందే.

2019 వరల్డ్‌కప్‌ వరకు సారథిగా ఉన్నాడు:

2019 వరల్డ్‌కప్‌ వరకు సారథిగా ఉన్నాడు:

సర్ఫరాజ్‌ అహ్మద్ 2019 వరల్డ్‌కప్‌ వరకు పాకిస్తాన్ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ టోర్నీలో టీమిండియా చేతిలో పరాజయం, మైదానంలో ఆవలింతలు తీయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక వరల్డ్‌కప్‌ తర్వాత అతన్ని సారథ్య బాధ్యతల నుండి తొలగించారు. తొలుత టెస్టు ఫార్మాట్‌ నుంచి సారథిగా తీసేసి.. అజహర్‌ అలీకి ఆ బాధ్యతలు ఇచ్చారు. అనంతరం వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి తొలగించి బాబర్‌ అజామ్‌కు పగ్గాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన జట్టులో సర్ఫరాజ్‌కు పీసీబీ అవకాశం కల్పించడం అతనికి ఊరటనిచ్చే అంశం.

2016లో కెప్టెన్‌గా బాధ్యతలు:

2016లో కెప్టెన్‌గా బాధ్యతలు:

ఏప్రిల్ 2016న సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు టీ20 కెప్టెన్‌గా నియమింపబడ్డాడు. ఆ తర్వాత 2017లో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2017లో వెస్టిండిస్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించడంతో.. ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు అతడినే కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కొన్ని అద్భుతాలే చేసినా.. ఆపై ప్రభావం చూపలేక మూల్యం చెల్లనుంచుకున్నాడు.

Story first published: Friday, July 3, 2020, 21:35 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X