మీరు ఎంతో ప్రత్యేకం... మీరో శక్తి: హ్యాపీ విమెన్స్‌ డే అంటూ క్రికెటర్లు

Posted By:
 International Women's Day: Virender Sehwag, Saina Nehwal, Harbhajan Singh Post Special Messages

హైదరాబాద్: గురువారం... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక, మహిళల్లో భారత బ్యాట్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లు ఉన్నారు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

లైంగిక వేధింపులు, వివక్ష, గృహ హింస, బెదిరింపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో అఘాయిత్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ మహిళలు తమ జీవితాలలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు చెప్పండి పురుషులు, మహిళలు సమానమేనా? కాదు, వారు మన కంటే ఎక్కువే. ప్రపంచంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

వీరేంద్ర సెహ్వాగ్‌

భోపాల్‌లోని ఓ మురికివాడలో 9 ఏళ్ల ముస్కాన్‌ లైబ్రరీ నడుపుతోంది. 121 పుస్తకాలతో ఆమె ఈ లైబ్రరీని ప్రారంభించింది. ఆమె అందరికీ స్ఫూర్తి. అలాగే 19 ఏళ్ల జైనాబ్‌ చిన్నతనంలో బాల కార్మికురాలిగా పని చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు చేయూతగా ఉంది. ఇప్పుడు పిల్లలందరూ చదువుకోవాలని ఉద్యమకారిణిగా మారింది. ప్రతి రోజు విమెన్స్‌ డేనే.

వీవీఎస్‌ లక్ష్మణ్‌

ప్రతి మహిళ ఎంతో విభిన్నం. అలాగే ఎంతో ప్రత్యేకం. మహిళలందరికీ హ్యాపీ విమెన్స్‌ డే. మీ అడుగుజాడలతో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారు

మహ్మద్ కైఫ్

నా భార్య పూజ ఎంతో అందంగా చెప్పింది. మహిళలు ఎంతో ప్రత్యేకం. ఏడాదిలో 365 ప్రత్యేకమైన రోజుల్లో ఈరోజు ఇంకా ప్రత్యేకం.

సురేశ్‌ రైనా

మహిళలు.. మీరు ఎంతో ప్రత్యేకం. మీరో శక్తి. మీ వైవిధ్యాలను ఈ రోజు గుర్తు చేసుకుని, పండగలా జరుపుకుందాం. హ్యాపీ విమెన్స్‌ డే

హర్భజన్‌ సింగ్‌

హ్యాపీ విమెన్స్‌ డే. తల్లి, సోదరి, భార్య, కుమార్తెగా నా జీవితంలో అద్భుతమైన మహిళలు ఉన్నారు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విమెన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపింది.

సైనా నెహ్వాల్‌

మీ పనిలో ప్రగతి సాధించండి. దినదినాభివృద్ధి చెందండి. హ్యాపీ విమెన్స్‌ డే

పీవీ సింధు

హ్యాపీ విమెన్స్ డే. మహిళగా పుట్టినందుకు గర్వపడండి

శిఖర్‌ ధావన్‌

మహిళలందరికీ విమెన్స్‌ డే శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో, అందరి మనస్సుల్లో సంతోషానికి మీరే కారణం. మీకు దూరంగా ఉన్నప్పుడు మీతో గడిపిన మధురక్షణాలను గుర్తు చేసుకున్నప్పటికీ ఆ లోటు తీరనిది

Story first published: Thursday, March 8, 2018, 15:45 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి