స్టార్క్‌ ఔట్: ఐపీఎల్‌కు ముందు కోల్‌కతాకు భారీ షాక్

Posted By:
Injured Mitchell Starc to miss IPL

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌ స్టార్క్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో టెస్టు ముందు మిచెల్‌ స్టార్క్‌ కుడికాలికి గాయమైంది.

దీంతో నాలుగో టెస్టుకు అతడి స్థానంలో 31 ఏళ్ల చాధ్‌ సేయర్స్‌ అరంగేట్రం చేయనున్నాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. గాయం కారణంగా మిచెల్ స్టార్క్ ఇప్పటికే స్వదేశానికి తిరుగు పయనమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక వెబ్‌సైట్‌‌లో పేర్కొంది.

భవిష్యత్తు టెస్టు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు సైతం దూరం కానున్నాడని పేర్కొంది. ఇప్పటికే భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌లిన్ ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిస్‌లీన్‌ దూరం చేసుకున్న కోలకతా మరో స్టార్‌ బౌలర్‌ను కోల్పోవడం ఫ్రాంచైజీని కలవర పెడుతోంది.

ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 9.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. స్టార్క్‌ గాయంతో గత సీజన్‌ ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌కు దూరమైన మూడో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా మిచెల్ స్టార్క్ నిలిచాడు.

బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో స్టీవ్ స్మిత్ రాజస్థాన్ కెప్టెన్‌గా ఉండగా, డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బాల్ టాంపరింగ్‌ వివాదంలో మిచెల్ స్టార్క్ ప్రమేయం కూడా ఉందని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

బాల్ టాంపరింగ్ వివాదం బయటపడిన నేపథ్యంలో స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది జట్టు సమిష్టి నిర్ణయమని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న కోల్‌కతా నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 15:33 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి