న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా కోచ్ రాజీనామా, ఆమోదం తెలిపిన బీసీసీఐ

Indian women’s cricket team coach Tushar Arothe resigns after players’ revolt

హైదరాబాద్: భారత మహిళల జట్టు కోచ్‌ తుషార్‌ అరోతె బాధ్యతల నుంచి వైదొలిగాడు. స్టార్‌ క్రీడాకారిణులతో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తిన కారణంగా అతడు రాజీనామా చేశాడు. అతడి శిక్షణ పద్ధతులపై మహిళా క్రికెటర్లు నిరసన వ్యక్తం చేశారు. 'తుషార్‌ రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు అతడు చెప్పాడు' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

సీనియర్‌ ప్లేయర్లు తుషార్‌ను తప్పించాలని డిమాండ్‌

సీనియర్‌ ప్లేయర్లు తుషార్‌ను తప్పించాలని డిమాండ్‌

ఐతే కొందరు సీనియర్‌ ప్లేయర్లు తుషార్‌ను తప్పించాలని డిమాండ్‌ చేశారని, ఆ నేపథ్యంలో అతడు రాజీనామా చేశాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. మరో 5 నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోచ్ తుషార్ రాజీనామా చేయడం చర్చనీయంగా మారింది. అయితే.. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్లు తుషార్ చెబుతున్నప్పటికీ కొంతమంది జట్టు సభ్యుల ప్రవర్తన తీరు వల్లే ఆయన అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్‌పై భారత్ పరాజయం వెనుక:

బంగ్లాదేశ్‌పై భారత్ పరాజయం వెనుక:

జూన్ నెలలో ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ పరాజయం చెందిన తర్వాత తుషార్ రాజీనామాపై పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. జట్టు సభ్యుల్లో కొంత మంది ప్రేమ వ్యవహారాలు, ఇతర విషయాలపై దృష్టి పెట్టి ఆటను నిర్లక్ష్యం చేస్తున్నారనేది కోచ్ తుషార్ ఆరోపణ. ఈ విషయంపై సదరు క్రీడాకారిణులను నిలదీయగా వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన బీసీసీఐ పెద్దల దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు సమాచారం.

జట్టు నష్టపోతోందని తుషార్ ఆవేదన:

జట్టు నష్టపోతోందని తుషార్ ఆవేదన:

కొంత మంది క్రీడాకారిణులు ప్రవర్తన మార్చుకోకపోవడం వల్ల జట్టు తీవ్రంగా నష్టపోతోందని తుషార్ ఆవేదన. దాన్ని సరిచేయడానికి ప్రయత్నించి విఫలమవడంతో చేసేదేంలేక ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. తన నిర్ణయానికి ఎవరూ కారణం కాదని, తనకు ఎవరి పట్ల ద్వేషంగానీ, కోపంగానీ లేవని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. జట్టు సభ్యుల సహకారం, సమష్టి కృషి వల్లే పలు విజయాలు సాధించడం సాధ్యమైందని ఆయన చెప్పారు.

2017 ఏప్రిల్ భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా:

2017 ఏప్రిల్ భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా:

మాజీ ఆల్‌రౌండర్, రంజీ ట్రోఫీ గెలిచిన బరోడా జట్టు సభ్యుడైన తుషార్.. 2017 ఏప్రిల్ భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాడు కూడా సరిగ్గా వన్డే ప్రపంచ కప్‌కు రెండు నెలల ముందు కోచ్ పూర్ణిమ రౌను బీసీసీఐ ఉన్నపలంగా పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశం అయింది. నవంబర్‌లో టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

‘మిథాలీ, జులన్‌ చాలా బాగా సహకరించారు. ఎలాంటి మొహమాటం లేకుండా అన్ని విషయాలను చర్చించేవాళ్లు. హర్మన్‌ పట్ల నాకెలాంటి చెడు అభిప్రాయం లేదు. కానీ నా మీద ఆమె ఫిర్యాదు చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ల భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నా' అని తుషార్‌ తెలిపాడు.

Story first published: Friday, July 13, 2018, 13:04 [IST]
Other articles published on Jul 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X