న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: కోహ్లీపై వేటు, ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్!

By Nageshwara Rao
Indian Premier League: Virat Kohli sacked by Royal Challengers Bangalore?

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ మార్పులు చేపడుతోంది. ఇప్పటికే ఆ జట్టు కోచింగ్ వ్యవస్థలో పలు మార్పులు చేసిన ఆ జట్టు యాజమాన్యం.... ఇప్పుడు కెప్టెన్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. 2013 నుంచి జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ స్థానంలో ఏబీ డివిలియర్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం.

13 ఏళ్ల రికార్డు బద్దలు: ద్రవిడ్ రికార్డుని సమం చేసిన కేఎల్ రాహుల్13 ఏళ్ల రికార్డు బద్దలు: ద్రవిడ్ రికార్డుని సమం చేసిన కేఎల్ రాహుల్

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఉన్న క్రేజే వేరు. ప్రతి సీజన్‌లోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగే ఆ జట్టు ఒక్కోసారి కూడా వాటిని అందుకోలేక పోయింది. జట్టులో హేమాహేమీలు ఉన్నప్పటికీ 11 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్‌ కోసం ఆర్‌సీబీ యాజమాన్యం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.

ఇందులో భాగంగా ఇటీవలే ఆ జట్టు వ్యవస్థలో పలు మార్పులు చేసింది. డానియల్‌ వెటోరీ స్థానంలో మెంటార్, చీఫ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించారు. తాజాగా మరో వార్త ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీ జట్టుకు కోహ్లీ స్థానంలో ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడట.

దీనిపై ఆర్‌సీబీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. క్రికెట్ వర్గాల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది. 2013 నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీనే టీమిండియాను విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ, ఆర్‌సీబీకి మాత్రం విజయాలు అందించలేకపోతున్నాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం డివిలియర్స్‌కు జట్టు పగ్గాలు అందించనుంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్ వచ్చే ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటానని ఇప్పటికే ప్రకటించాడు. దీనికితోడు కిర్‌స్టెన్‌తో అతనికి మంచి సమన్వయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏబీకి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఏడాది ఐపీఎల్‌ మార్చి 29 నుంచి మే 19 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ తర్వాత కొంత కాలం కుటుంబంతో గడిపిన ఏబీ డివిలియర్స్... త్వరలో జరగనున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌(పీసీబీ)లో ఆడనున్నట్లు ఇటీవలే ప్రకటించాడు.

Story first published: Sunday, September 9, 2018, 12:19 [IST]
Other articles published on Sep 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X