న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏరోజైతే కెరీర్‌ను ఆరంభించాడో ఆరోజే రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

By Nageshwara Rao
 Indian Cricketer RP Singh Announces Retirement on the Same Day He begins Career

హైదరాబాద్: టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 32 ఏళ్ల ఆర్పీ సింగ్‌ తన నిర్ణయాన్ని మంగళవారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

"13 ఏళ్ల కింద సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబరు 4, 2005) తొలిసారి భారత జట్టు జెర్సీ ధరించా. ఆట నాకెన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చింది. ఈ రోజు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నా" అని ఆర్పీ సింగ్‌ ట్విట్టర్ ‌లో రాసుకొచ్చాడు. 2005లో జింబాబ్వేపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

టీమిండియాకు 14 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన ఆర్పీ సింగ్ 3.98 సగటుతో 40 వికెట్లు తీశాడు. ఇక, 58 వన్డేల్లో 5.48 యావరేజితో 69 వికెట్లు తీసుకున్నాడు. భారత్ తరుపున 10 టీ20లాడిన ఆర్పీ సింగ్ 15 వికెట్లు పడగొట్టాడు.

2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో ఆర్పీ సింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 82 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ లాంటి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Wednesday, September 5, 2018, 13:07 [IST]
Other articles published on Sep 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X