న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముక్కోణపు టీ20 సిరిస్‌కు భారత జట్టు ఎంపిక: జులన్ పునరాగమనం

India Women’s squad for T20I Tri-Series announced; Jhulan back after injury lay-off

హైదరాబాద్: గాయంతో కొద్దికాలంగా జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ జులన్‌ గోస్వామి తిరిగి జట్టులో చేరనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం బుధవారం ప్రకటించిన భారత మహిళల జట్టులో జులన్‌కు చోటు కల్పించారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గత నెల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పాల్గొన్న జట్టునే దాదాపుగా కొనసాగించారు.

ఆరేళ్ల తర్వాత తిరిగి జట్టులో చేరి దక్షిణాఫ్రికా పర్యటనలో మంచి ప్రదర్శన కనబరిచిన పేసర్‌ రుమేలిధర్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా,ఇంగ్లండ్, భారత్ మధ్య ముంబై వేదికగా మార్చి 22 నుంచి 31 వరకు జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ కోసం భారత మహిళా జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు.

జట్టు: హర్మన్‌ప్రీత్‌(కెప్టెన్‌), స్మృతి మంధానా (వైస్‌ కెప్టెన్‌), మిథాలీ, వేద కృష్ణమూర్తి, జెమీమా, అనుజా పాటిల్‌, దీప్తి శర్మ, తానియా (వికెట్‌ కీపర్‌), పూనమ్‌ యాదవ్‌, ఏక్తా బిస్త్‌, జులన్‌ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌, రుమేలి ధర్‌, మోనా మెష్రమ్‌.

మ్యాచ్ షెడ్యూల్ పూర్తి వివరాలు:
March 22: India vs Australia
March 23: Australia vs England
March 25: India vs England
March 26: India vs Australia
March 28: Australia vs England
March 29: India vs England
March 31: Final

అన్ని మ్యాచ్‌లకు ముంబై సీసీఐ స్టేడియం వేదిక కానుంది.
Channel: StarSports 1/HD1

వడోదరా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్:
వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళా జట్టు ఒక్కసారిగా ఓటమికి గురైంది. దీంతో సిరీస్ గెలుచుకోవాలనే తపన మరింత పెరిగింది. ఆస్ట్రేలియాపై గెలిస్తేనే సిరీస్ చేజిక్కుతుంది. గురువారం వడోదర వేదికగా రెండో వన్డేలో మిథాలీసేన ఆస్ట్రేలియా మహిళా జట్టుతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే ఆరాటంలో భారత్ ఉంది.

తొలి వన్డేకు దూరమైన మిథాలీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంతో జెమీమాను పక్కన పెట్టక తప్పదు. ఆస్ట్రేలియా విషయానికొస్తే ప్రపంచకప్ సెమీఫైనల్ పరాభవానికి భారత్‌పై బదులుతీర్చుకుని సిరీస్‌ను శుభారంభం చేసింది. తొలి వన్డేలో అజేయ శతకం సాధించిన బోల్టన్ మరోసారి చెలరేగి ఆడేందుకు సిద్ధమైంది. కెప్టెన్ లానింగ్, హీలీ కీలకం కానున్నారు.

Story first published: Thursday, March 15, 2018, 11:31 [IST]
Other articles published on Mar 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X