న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆస్ట్రేలియాను మనం గెలిచేశాం'

India will win Test series in Australia, predicts former India batsman Vinod Kambli

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు ముందుండి నడిపించి పరుగుల వరద పారించే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని సమయమే ఆ జట్టును ఓడించడానికి మంచి సమయమని మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి అన్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో దూసుకెళ్తున్న పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ పరుగుల దాహం టీమిండియాను 110శాతం ముందుకు నడిపిస్తుందని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్‌ల అనంతరం చేయనున్న ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడాడు.

 స్మిత్.. వార్నర్ లేకపోవడమే మంచి సమయం

స్మిత్.. వార్నర్ లేకపోవడమే మంచి సమయం

కోహ్లీసేన ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్‌ 6న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ‘విరాట్‌ కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడు. అది మంచిదే. అతడినలా చూడడం బాగుంది. విరాట్‌ పని విలువలు, మైదానంలో తన వైఖరితో 110 శాతం న్యాయం చేస్తున్నాడు. అతడిలోని పరుగుల దాహమే నాకిష్టం' అని కాంబ్లి అన్నాడు.

 ఆస్ట్రేలియా సిరీస్‌‌ను గెలవబోతున్నాం

ఆస్ట్రేలియా సిరీస్‌‌ను గెలవబోతున్నాం

‘మన అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కొద్ది రోజుల్లో మొదలుకాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌‌ను మనమే గెలవబోతున్నాం. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్మిత్‌, వార్నర్‌ అందుబాటులో లేరు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి' అని కాంబ్లి పిలుపునిచ్చాడు. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో వీరిద్దరిని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది కాలం నిషేధించింది. దీంతో వారు దేశీవాలీ లీగ్‌లు ఆడుతూ జట్టుకు దూరంగా ఉన్నారు.

సచిన్ కూడా అదే మాట:

సచిన్ కూడా అదే మాట:

ఆస్ట్రేలియా పర్యటనను ఉద్దేశించి సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లీకి కొన్ని సూచనలిచ్చాడు. కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడిన సచిన్.. స్మిత్, వార్నర్ లేకపోవడం టీమిండియాకు మరింత కలిసొస్తుంది. ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

 సహజశైలిలోనే ఆడితేనే షాకు మంచిది.

సహజశైలిలోనే ఆడితేనే షాకు మంచిది.

అరంగేట్రంలోనే సెంచరీలతో ఆకట్టుకున్న యువ సంచలనం పృథ్వీషాపై కాంబ్లి ప్రశంసలతో కూడిన సూచనలు ఇచ్చాడు. ‘అతడు స్ట్రోక్‌ ప్లేయర్‌. బంతిని ఆలస్యంగా ఆడి పరుగులు చేయడం ఇష్టపడతాడు. అతనికి సరిపోయే షాట్లు ఆడేందుకు ఇష్టపడతాడు. సహజశైలిలోనే ఆడితే షాకు మంచిది. నేనెప్పుడూ అతడికిదే చెప్తాను. అతిగా ఆలోచించొద్దు. ఆటను ఆస్వాదించు. ఆత్మవిశ్వాసంతో ఉండు. ఆస్ట్రేలియాలాంటి పర్యటనలకు వెళ్లినప్పుడు ఇదే కీలకం' అని కాంబ్లి తెలిపాడు.

Story first published: Wednesday, November 7, 2018, 12:31 [IST]
Other articles published on Nov 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X