న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గనిస్తాన్ జట్టును తేలికగా తీసుకోం: రహానె

 India will not take Afghanistan lightly in one-off Test, says skipper Ajinkya Rahane

హైదరాబాద్: ఐపీఎల్ అనంతరం జరగబోతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో అఫ్గనిస్తాన్‌తో భారత్ ఆడనున్న ఏకైక టెస్టుకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ టెస్టును తేలికగా తీసుకోబోమని టీమిండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్‌‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే మాట్లాడాడు.

టెస్టులకు కొత్త కదా అని తేలికగా:

టెస్టులకు కొత్త కదా అని తేలికగా:

‘ప్రత్యర్థి ఎవరైనా మైదానంలో దిగామంటే మా ఆలోచనా విధానం ఓకేలా ఉంటుంది. ప్రతి టెస్టుకు ఒకే ప్రాధాన్యత ఇస్తాం, అఫ్గాన్‌కు టెస్టు హోదా లభించడం మంచి విషయం. టెస్టులకు కొత్త కదా అని తేలికగా తీసుకోం. మా బలాలపై దృష్టిసారించడమే మాకు ముఖ్యం. అఫ్గాన్‌ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. వారంతా లిమిటెడ్‌ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. మైదానంలో అడుగుపెట్టామంటే బ్రాండ్‌ క్రికెట్‌ ఆడటానికే ప్రయత్నిస్తాం' అని రహానే వివరించాడు.

 రషీద్‌, ముజీబ్‌లపై స్పందిస్తూ..

రషీద్‌, ముజీబ్‌లపై స్పందిస్తూ..

ప్రత్యర్థి జట్టు బౌలర్లు అయిన రషీద్‌, ముజీబ్‌లపై స్పందిస్తూ.. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారని, ఎరుపు బంతికి కొత్త కావచ్చు కానీ నాణ్యమైన స్పిన్నర్లని అభిప్రాయపడ్డాడు. అలాగని పేస్‌ బౌలర్లను తక్కువ అంచనా వేయలేమన్నాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్సీ వహించడం తనకు మరింత ధైర్యాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. మంచి ఫలితాలు సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

వన్డే జట్టులోకి తిరిగి రావడం నాకెంతో అవసరం

వన్డే జట్టులోకి తిరిగి రావడం నాకెంతో అవసరం

ప్రపంచకప్‌ అవకాశలపై మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్‌ టోర్నీలో ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరు ఆశయంగా పెట్టుకుంటారు. ఇంకో ఏడాది సమయం ఉంది. వన్డే జట్టులోకి తిరిగి రావడం నాకెంతో అవసరం' అని పేర్కొన్నాడు.

ధర్మశాల టెస్టుకు.. రహానేకు తొలి సారి నాయకత్వం

ధర్మశాల టెస్టుకు.. రహానేకు తొలి సారి నాయకత్వం

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో కెప్టెన్‌ కోహ్లి గాయంతో సిరీస్‌ నిర్ణయాత్మక ధర్మశాల టెస్టుకు దూరమయ్యాడు. దీంతో రహానేకు తొలి సారి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించిన రహానే భారత్‌కు విజయాన్నందించాడు. తాజా అఫ్గాన్‌ టెస్టుకు కోహ్లికి విశ్రాంతి కల్పించడంతో రహానేకు మరోసారి కెప్టెన్సీ అవకాశం వచ్చింది. జూలై 14న ఈ చారిత్రాత్మక టెస్ట్‌ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, May 30, 2018, 12:58 [IST]
Other articles published on May 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X