న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్ సత్ప్రవర్తన కలిగిన జట్టు, పాండ్యాది పెద్ద సమస్యే కాదు'

ICC CEO David Richardson Says Virat Kohli A Great Ambassador For The Game | Oneindia Telugu
India well-behaved team: ICC CEOs response to queries on Pandya sexist row

హైదరాబాద్: ఓ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిషేధానికి గురైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వివాదంపై ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ స్పందించారు. గురువారం వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమం కోస వచ్చిన ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. మహిళలపై హార్దిక్‌ పాండ్యా అనుచిత వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా పాండ్యా అంశం బీసీసీఐ పరిష్కరిస్తుందని, ఇది చాలా చిన్న సమస్య అని రిచర్డ్‌సన్ చెప్పుకొచ్చారు.

2023 వరల్డ్ కప్‌కు భారతే ఆతిథ్యమిస్తుంది: ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్2023 వరల్డ్ కప్‌కు భారతే ఆతిథ్యమిస్తుంది: ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్

"మైదానంలో టీమిండియా సత్ప్రవర్తన కలిగిన జట్టు. అంపైర్ నిర్ణయాలను గౌరవిస్తుంది. క్రీడాస్ఫూర్తితో మ్యాచ్‌లు ఆడుతుంది. జట్టు మొత్తం సమిష్టిగా విజయాల కోసం కష్టపడుతుంది. విరాట్‌ కోహ్లీ క్రికెట్‌కు మంచి రాయబారి. టీ20 గురించే కాకుండా వన్డే, టెస్టు క్రికెట్‌ గురించి అతడు ఆత్మీయతతో మాట్లాడతాడు" అని అన్నాడు.

"చక్కని ఆటగాళ్లంతా అన్ని ఫార్మాట్లు ఆడాలని భావిస్తారు. ఇలాంటి మంచి ఆటగాళ్లందరూ అన్ని ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నాం. పాండ్యా విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుంది. అంతర్జాతీయ దృక్పథంతో చూస్తే ఇదో పెద్ద సమస్యే కాదు. ఫిట్‌నెస్‌ విషయానికి వస్తే విరాట్‌, జట్టుకు అనుసంధాన కర్తగా ధోనీ ఉన్నారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌పై దృష్టి పెరిగింది. ప్రస్తుతం భారత జట్టు సమతూకంగా ఉంది" అని రిచర్డ్‌సన్‌ అన్నాడు.

Story first published: Friday, February 1, 2019, 10:23 [IST]
Other articles published on Feb 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X