న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ పర్యటన అనంతరం విరామం నిమిత్తం ఆసియా కప్‌కు గైర్హాజరీ అయిన విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ రికార్డును సమం చేయనున్నాడు. టెస్టుల్లో వెస్టిండీస్‌తో ఆడిన టీమిండియా కెప్టెన్‌లలో ఇప్పటివరకు అజారుద్దీన్ (539 పరుగులు)దే రికార్డు. ఇపుడు దీనిని కోహ్లీ సమం చేయనున్నాడు.
ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో ఆడలేకపోయిన కోహ్లీ ఈనెలలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్‌లలో ఆ ఘనతను సాధించనున్నాడు. విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌పై ఇప్పటివరకు 502 పరుగులు చేశాడు. అంటే మరో 37 పరుగులు చేస్తే అజారుద్దీన్ రికార్డుకు సమం అవుతుంది. ఇంతవరకు వెస్టిండీస్‌తో కోహ్లీ 10 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 38.61 సరాసరిన అత్యధికంగా 200 పరుగులు సాధించాడు.
కాగా, వెస్టిండీస్‌పై అత్యధికంగా పరుగులు చేసిన భారత క్రికెటర్లలో బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (2746) అగ్రస్థానంలో ఉన్నాడు. గవాస్కర్ తర్వాత రాహుల్ ద్రవిడ్ (1978), వీవీఎస్ లక్ష్మణ్ (1715). ఇదిలావుండగా, అక్టోబరు 4న రాజ్‌కోట్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. 12న హైదరాబాద్‌లో రెండో టెస్టు జరగనుంది.
అదే విధంగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అక్టోబరు 21 నుంచి ప్రారంభమై నవంబర్ ఒకటో తేదీ వరకు జరుగుతుంది. నవంబర్ 4, 6, 11 తేదీల్లో రెండు జట్ల మధ్య మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా, వెస్టిండీస్ 1948 నుంచి ఇప్పటివరకు భారత్‌తో 94 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 30 మ్యాచ్‌లో విజయం సాధించగా, 28 మ్యాచ్‌లలో ఓడిపోయింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.