న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండిస్ ప్రదర్శనపై భజ్జీ ట్వీట్: ట్వీట్లకు పనిచెప్పిన నెటిజన్లు

India vs West Indies 2018 : Cricket Fans Slams Harbhajan Singh Over His Disrespectful Tweet|Oneindia
India vs Windies: Harbhajan Singh gets trolled after ‘disrespectful’ West Indies tweet

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో తొలి టెస్టు తొలిరోజు యువ ఆటగాడు పృథ్వీషా (134) పరుగులతో సెంచరీ సాధించగా.... పుజారా (86) పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు: ఇది మా అమ్మకు అంకితం: జడేజా (వీడియో)టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు: ఇది మా అమ్మకు అంకితం: జడేజా (వీడియో)

ఇక, రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ(137) సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ చేయగా, రిషబ్‌ పంత్‌(92) చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా సైతం టెస్టుల్లో సెంచరీని నమోదు చేశాడు. 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జడేజా సెంచరీ అనంతరం కెప్టెన్‌ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు.

1
44264
 రెండో రోజు 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్

రెండో రోజు 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండిస్ జట్టును భారత బౌలర్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చారు. ఫలితంగా రెండో రోజు 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు కూడా వెస్టిండిస్ ఇలాంటి ప్రదర్శననే కొనసాగిస్తే, మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోయే అవకాశం ఉంది.

విండీస్‌ను తక్కువ చేస్తూ హర్భజన్ సింగ్ ట్వీట్

ఈ నేపథ్యంలో వెస్టిండిస్ బ్యాటింగ్‌పై భారత సీనియర్ బౌలర్ హార్బజన్ సింగ్ చేసిన ట్వీట్ విమర్శల పాలవుతోంది. టీమిండియా ఆటతీరును మెచ్చుకోబోయే... విండీస్‌ను తక్కువ చేస్తూ హర్భజన్ సింగ్ ట్వీట్ ఉండడమే ఇందుకు కారణం. భజ్జీ తన ట్విట్టర్‌లో "వెస్టిండీస్ క్రికెట్ పైన నాకెంతో గౌరవం ఉంది. అయితే మీ అందరికీ నాదో ప్రశ్న. ఈ వెస్టిండీస్ జట్టు రంజీ ట్రోపీ ప్లేట్ గ్రూప్ దశ నుంచి క్వార్టర్స్‌కి అర్హత సాధించగలుగుతుందా? ఇలా అయితే సాధ్యం కానట్టే అనిపిస్తోంది" అని ట్వీట్ చేశాడు.

హర్భజన్ చేసిన ట్వీట్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు

హర్భజన్ చేసిన ట్వీట్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు

హర్భజన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శన కూడా ఇలాగే ఉందని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా హర్భజన్ సింగ్ సభ్యుడిగా ఉన్న 2011, 2014 ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా ప్రదర్శన ఇలాగే ఉందని, అప్పుడు ఇంగ్లీష్ క్రికెటర్లు ఇలా కామెంట్ చేసి ఉంటే ఎలా స్పందించేవాడివని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

విండీస్ బలహీనం అవడానికి కారణం అదే

విండీస్ బలహీనం అవడానికి కారణం అదే

ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా ఓ జాతీయ జట్టుకు గౌరవం ఇవ్వాలని కనీస బాధ్యత క్రికెటర్లపై ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. క్రిస్ గేల్, బ్రావో, రస్సెల్, పోలార్డ్ వంటి సీనియర్లు దూరమైన విండీస్ బలహీనమైందని... వారందరూ ఉండి ఉంటే గేమ్ మరోలా ఉండేదని హర్భజన్ సింగ్‌‌కు ట్విట్టర్‌లో బదులిస్తున్నారు.

Story first published: Saturday, October 6, 2018, 10:01 [IST]
Other articles published on Oct 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X