న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాల్గో వన్డేలో టీమిండియా ప్లేయర్ల రేటింగ్

India vs Windies, 4th ODI – India Player Ratings

హైదరాబాద్: భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ ఓటమికి కారణం రనౌట్సేనని ఆ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌తో ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ భారత్ జట్టు బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను చేధించలేని వెస్టిండీస్ చేతులెత్తేసింది.

ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సులు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులు) సెంచరీలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేను గురువారం భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురం వేదికగా జరగనుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్ల రేటింగ్‌లు ఈ విధంగా ఉన్నాయి.

రోహిత్ శర్మ: 9.5/10

రోహిత్ శర్మ: 9.5/10

టాస్ గెలిచిన టీమిండియాకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ జట్టులో ముఖ్యుడిగా నిలిచాడు. రెండో సెంచరీ చేసేస్తాడేమో అనే రీతిలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు రోహిత్. ఈ మ్యాచ్ మొత్తంలో 137బంతులాడిన రోహిత్ 162పరుగులు చేశాడు. అందులో 20ఫోర్లు, 4సిక్సులు ఉన్నాయి.

శిఖర్ ధావన్: 5/10

శిఖర్ ధావన్: 5/10

రోహిత్‌తో పాటుగా మరో ఎండ్‌లో ఓపెనర్‌గా దిగిన ధావన్.. డీసెంట్‌గా మొదలుపెట్టి ఎక్కువ పరుగులు చేయకుండానే తన వికెట్‌ను కోల్పోయాడు. 40 బంతులు ఆడిన ధావన్ కేవలం 38పరుగులు మాత్రమే చేయగలిగాడు. కీమో పాల్ చేతుల మీదుగా 12వ ఓవర్లో అవుట్ అయి పెవిలియన్ చేరుకున్నాడు.

విరాట్ కోహ్లీ: 2/10

విరాట్ కోహ్లీ: 2/10

ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో అద్భుతాలు సృష్టించే విరాట్ కోహ్లీ నాల్గో వన్డేలో మాత్రం పేలవ రీతిలో అవుట్ అయ్యాడు. ఇదే సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన కోహ్లీ ఇంతటి తక్కువ పరుగులతో అవుట్ అవడం స్టేడియంలో వారెవ్వరికీ మింగుడుపడలేదు.

అంబటి రాయుడు: 9/10

అంబటి రాయుడు: 9/10

చాలా కాలం నాటి నుంచి టీమిండియాలో నాలుగో స్థానం కోసం తడబడుతున్న కోహ్లీసేనకు అంబటిరాయుడు ఊరటలా దొరికాడు. దాదాపు వచ్చిన అవకాశాన్ని దక్కించుకున్న రాయుడు సెంచరీతో అదరగొట్టాడు. ఆలస్యంగా ఫామ్ లోకి వచ్చినా అతనిపై పెట్టుకున్న ఆశలు నిలబెట్టుకున్నాడు. నాల్గో వన్డేలో రాయుడు ఆటతీరును చూసి కెప్టెన్ ప్రపంచ కప్ వరకూ అతనికి ప్రతి మ్యాచ్ లోనూ అవకాశం వచ్చేలా చూసుకుంటామని మాటిచ్చాడు.

ఎంఎస్ ధోనీ: 4/10

ఎంఎస్ ధోనీ: 4/10

ప్రస్తుతం టీమిండియాలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్లేయర్లలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. మంచి ఫినిషర్‌గా భావించే ధోనీ.. అంచనాలు అందుకోలేక తక్కువ పరుగులతోనే సరిపెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో 15బంతులు ఆడిన ధోనీ 23పరుగులు మాత్రమే చేయగలిగాడు. కీపింగ్‌లో మాత్రం స్థాయికి తగ్గకుండా ప్రదర్శన చేసినా బ్యాటింగ్‌లో సంతృప్తిపరచలేకపోతున్నాడు.

కేదర్ జాదవ్: 5/10

కేదర్ జాదవ్: 5/10

ఈ మ్యాచ్ మొత్తంలో తానేంటో నిరూపించుకునేందుకు కేదర్ జాదవ్‌కు పెద్దగా అవకాశాలేమీ రాలేదు. ఇన్నింగ్స్ చివర్లో ఉండగా బ్యాటింగ్‌కు దిగాడు. అక్కడికి 7బంతుల్లోనే 16పరుగులు చేశాడు. అందులో మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అతనికి ఈ మ్యాచ్‌లో బౌలింగ్ అవకాశాలివ్వలేదు.

రవీంద్ర జడేజా: 5/10

రవీంద్ర జడేజా: 5/10

జడేజాకు ఈ మ్యాచ్‌లో మరో సారి మెరిశాడు. పది ఓవర్లు బౌలింగ్ వేసిన జడేజా జట్టుకు ఉపయోగకరంగా ఆడాడు. బ్యాటింగ్‌లో 39 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు.

 భువనేశ్వర్ కుమార్: 4/10

భువనేశ్వర్ కుమార్: 4/10

నాల్గో వన్డేలో భువనేశ్వర్ ఐదు ఓవర్లు బౌలింగ్ చేసినా చక్కగా ఆకట్టుకోలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ ఓవర్‌ను మైడెన్ చేసిన భువనేశ్వర్ చంద్రపాల్ హేమ్ రాజ్ వికెట్‌ను పడగొట్టాడు. మొత్తంగా 30 పరుగులు మాత్రమే చేశాడు.

 కుల్దీప్ యాదవ్: 8/10

కుల్దీప్ యాదవ్: 8/10

మ్యాచ్ ఆసాంతంలో కుల్దీప్ చక్కగా మెరిపించాడు. జాసన్ హోల్డర్‌ చేతిలో కాసేపటి వరకూ అసహనానికి గురైయ్యాడు. మొత్తంగా 3/42స్కోరుతో బౌలింగ్‌ను పూర్తి చేశాడు.

 జస్ప్రిత్ బుమ్రా: 5/10

జస్ప్రిత్ బుమ్రా: 5/10

ఈ మ్యాచ్‌లో వికెట్ తీయలేదనిపించుకోకుండా ఆడాడు బుమ్రా. ఎనిమిది ఓవర్లు వేసిన బుమ్రా 25పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఖలీల్ అహ్మద్: 9/10

ఖలీల్ అహ్మద్: 9/10

మ్యాచ్‌కు అనుకూలించిన వాటిల్లో అత్యంత కీలకమైన ప్లేయర్ ఖలీల్ అహ్మద్. మిడిల్ ఓవర్లలో చక్కటి బౌలింగ్ వేశాడు. ఐదు ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన ఖలీల్ 3/13తో మ్యాచ్‌ను ముగించాడు. ఇతని బౌలింగ్‌లో మార్లొన్ శామ్యూల్స్, షిమ్రోన్ హేట్‌మెయర్, రొవ్‌మాన్ పొవెల్‌ల వికెట్లను కోల్పోయింది వెస్టిండీస్.

Story first published: Tuesday, October 30, 2018, 15:57 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X